Monday, October 2, 2023

శివోహం

శివా!నీకు అసలు లేనేలేవు అరమరికలు
కథలు కథలుగ తెలిసె నీ కదలికలు
శంకరా అంటే కింకరా అంటావు
మహేశా . . . . . శరణు .

శివోహం

భక్తి మార్గంలో మనస్సు బాలుని మనస్సు లాగ స్వచ్చంగా ఉండాలి.. ధనం,గౌరవం,జ్ఞానం ఎంత పెరిగిన మనస్సు మాత్రం బాలకుని లాగ స్వచ్చంగా ఉండాలి.

ఓం నమః శివాయ

Sunday, October 1, 2023

జై హనుమాన్

జై బజరంగీ

ఓం హం హనుమతే నమః
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శివోహం

శివా!జగతి చిత్రాన్ని రచన చేసి
తెల్ల కొండపైన తెలియ వచ్చావు
చల్లని నీ కరుణ విరియ జేసావు
మహేశా . . . . . శరణు .

Saturday, September 30, 2023

శివోహం

శివా!చేత పాత్రపట్టి నా ఎదుట కొచ్చి
భిక్షపాత్ర కాదిది అక్షయపాత్రగ తెలిపి
కోరుకొనమంటివి నన్ను కామ్యార్ధమెరిగి
మహేశా . . . . . శరణు .

శివోహం

మనిషిలోని శక్తికి కారణం దైవం...
అచ్చుకు హల్లు కలిపితే అక్షర ప్రభావం మారినట్టు గా మనలో అంతర్యామిగా ఉన్న సర్వాంతర్యామి మహాదేవుడు ను ధ్యానిస్తూ చేసే ప్రతిపని విజయవంతం అవుతుంది.
మనిషీ కృషికి దైవం చేయూత నిస్తే అద్భుతాలు చేస్తాడు.
ఓం శివోహం... సర్వం శివమయం

Friday, September 29, 2023

శివోహం

దినదినము ధ్వనిస్తున అవనాలను స్పందించే మనసుతో ఎదుర్కొంటు విధికి తలవంచుతూ కర్మ ఫలితాన్ని స్వీకరిస్తూ నీ ధర్మ ఫలితం ఆశిస్తున్నాను...
శివ నీ దయ.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...