Saturday, October 7, 2023

శివోహం

కాలం కక్ష్య కట్టిన...
కష్టం పరీక్ష పెట్టిన అలసి పోతానేమో కానీ ఓడిపోను...
ఎందుకంటే ముందుండి నడిపించే నా శివుడే నాకు రక్ష..
శివోహం.. సర్వం శివమయం.

శివోహం

నమోకేశవ...
నమోనారాయణ...
నమోమాధవ...
నమోగోవింద...
నమోవిష్ణు...
నమోమధుసూధన...
నమోత్రివిక్రమ...
నమోవామన...
నమోశ్రీధర...
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ...

శివోహం

ఎక్కడ మనకు ప్రశాంతత దొరుకుతుందో...

అక్కడ సాక్షాత్తు భగవంతుడు కొలువై ఉంటాడు...
ఓం నమః శివాయ

Friday, October 6, 2023

శివోహం

ఇంత చక్కగా ఎలా ఉంటావు శివ... 
అంత ధ్యానము నీకేల జ్ఞానేశ్వరా...
గంగమ్మ నీ కొప్పున కొలువైనందుకా
లేక నెలవంక నీ శిరస్సున ఉన్నందుకా 
పార్వతీదేవి నీ పక్కన ఆసీనురాలైనందుకా...
లేక హిమగిరులు నీ నివాసము ఐనందుకా...
మెడలోన నాగేంద్రున్ని ధరించినందుకా...
లేక కైలాసమే నీ క్షేత్రము ఐనందుకా...
మాక్కూడా తెలపవయ్య సర్వేశ్వరా...
మహాదేవా శంభో శరణు.

శివోహం

అర్ధరాత్రి గర్భగుడిలోనో లేక స్మశానంలోనో ఒక్కడివే తిరుగుతూ ఉంటావట కదా...
 నెను రానా శివ నీకు తోడుగా...

శివ నీ దయ.

శివోహం

నీవు నల్లరాయి...
నేను బండరాయి...
నువ్వే నేను నేనె నువ్వు...
శివ నీ దయ.

శివోహం

శివా!అభయమీయగ నిన్ను అర్ధించునటుల
చరణాల చుట్టి శరణమంటున్న వాసుకికి
నేను వారసుడనయ్యా నన్ను ఆలకించు
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...