Tuesday, October 17, 2023

శివోహం

శివా!మనసు మాట వొదిలేస్తా
నిను చేరు మార్గమున అడుగేస్తా
నీ పదములు చూస్తూ గడిపేస్తా
మహేశా . . . . . శరణు .

శివోహం

ఈ లోకంలో సుఖంగా సంతోషంగా జీవించాలి అనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే 
నిజంగా ఈ లోకంలో ఎవ్వరునూ పరిపూర్ణమైన సుఖ సంతోషాలతో జీవించలేరు 
తమ మనసులో పరమాత్మ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులోనే జీవించే వారు మాత్రమే సుఖ సంతోషాలను అనుభవించగలరు.

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, October 16, 2023

శివోహం

శ్రీ అన్నపూర్ణా దేవి..
సకల జీవులకు అన్నం ఆధారం...
కాశీ విశ్వేశ్వరుడి ప్రియ పత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతున్నా అన్నపూర్ణాదేవిని పూజిస్తే తిండికి లోటుండదు...
సకల ఐశ్వర్యాలు కలుగుతాయి...
ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ఆకలిదప్పులు వంటి బాధలు ఉండవు...
అన్నపూర్ణా దేవి ఈరోజు గంధం రంగు చీరలో దర్శనం ఇస్తారు. తెల్లని పుష్పాలతో పూజిస్తారు...
అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్ధోజనం నైవేద్యం పెడతారు. ఈరోజు అన్నదానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఓం శ్రీమాత్రే నమః

శివోహం

శివా!కూడబెట్టుకున్నాను కర్మ ఫలాలు
వదలించుకొనగ పడుతున్నా యాతనలు
ఏ కర్మ ఫలమూ వద్దు..
చేరనీ నీ చరణాలు...
మహేశా . . . . . శరణు .

Sunday, October 15, 2023

అమ్మ

దధానా కరపద్మాభ్యాం  అక్షమాలాకమండల:
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా...

ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్
అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ దేవి అమ్మవారు. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. గాయత్రీ మంత్రం జపిస్తే చతుర్వేదాలు చదివిన ఫలితం కలుగుతుందట. అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరలో దర్శనం ఇస్తారు. తామర పూవులతో అమ్మవారిని పూజించాలి. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ఎర్రటి గాజులు దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి తేజస్సు పెంపొందుతుంది.

శివోహం

శిక్షించడం దైవ నిర్ణయం కాదు...
పరీక్షించడమే దైవ మార్గం...
చేసిన కర్మలకు పశ్చాత్తాపం పడడమే...
మనిషి చేయగలిగిన కర్మమార్గం...

ఓం పరమాత్మనే నమః.

శివోహం

వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం...
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్...

ఓం శైలపుత్రినే ( బాలా త్రిపుర సుందరి) నమః

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...