Monday, November 6, 2023

శివోహం

శివ...
నీ నామాన్ని జపిస్తు లక్షణమైన అక్షరామలాను కూర్చాను సులక్షణంగా...
సదాశివ నీ దయ.

మహాదేవా శంభో శరణు.
ఓం పరమాత్మనే నమః

శివోహం

శివ...
ఎదో ఒకరోజు శుభ ముహూర్తనా
ఐనవాళ్ళందరిని వదిని...
నీ ఎదురుగా నేను నిల్చున్నప్పుడు...
నన్ను నేనై మరిచిపోతానేమో...
నీలో నన్ను చూసుకున్నప్పుడు...
నీవే తట్టిలేపాలి నీలో నే కలిసిపోవాలి...
మహాదేవా శంభో శరణు.

శివోహం

నీను తలకపోతే నా శ్వాస ఆగిపోతుంది ఏమో...

సదాశివ నీ దయ.

Sunday, November 5, 2023

శివోహం

శివనామస్మరణ తలపులలో నిలిచి గూడుకట్టుకున్నవి...
నీనామ జపంలో సర్వం మరచి మనసులో మైమరచి ఆధ్యాత్మిక ఆనందానుభూతి పొందుతున్న వేళ మౌనం సామ్రాజ్యం ఏలుతూ స్మరణ మనన ధ్యాన ధ్యాసలు నలుదిశలుగా భావించే భాగ్యం 
కలిగించవా....
నీరూపం చూడగానే నా మనసు నీవలే ఘడియైనా నిలిచేలా దీవించు తండ్రీ.

ఓంమహాదేవా శంభో శరణు.

శివోహం

నీ నామ స్మరణ లతో
ఎన్ని యుగాలు గడిచాయో శివ...
నేను నువ్వు అయ్యేది ఎప్పుడో...
ఇంకెన్నేళ్ళు ఈ నిరీక్షణ...     

     *శివ నీ దయ*

శివోహం

శివా!వరము లీయగ వేగిర పడిదెవవు గాని
వైరి నంతము చేయ వేచి చూచెదవు
వివరమేమిటో గాని వింతగా వున్నది
మహేశా . . . . . శరణు .

Saturday, November 4, 2023

శివోహం

పూజకు లొంగేవాడు...
తండ్రి వలె పొగడ్తలు పొంగి వరాలు ఇచ్చేవాడు...
అట్టహాసం లేని వాడు...
కుల మత పేద ధనిక భేదం 
అహంకారం మచ్చుకైనా లేనివాడు మహాదేవుడి తనయుడిని నమ్ముకో...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

నీ చిరునవ్వుల చిరుజల్లులు నా పై కురిపించి వెళ్ళు.... అరుణాచల