Wednesday, November 29, 2023

శివోహం

శివా!నీ కంటిలోన మంట ఆరదు
నీ గొంతులోని విషము జారదు
నీ కరుణ కురియుట ఆగదు.
మహేశా . . . . . శరణు .

Tuesday, November 28, 2023

శివోహం

శివ...
జానెడు పొట్ట నింపుకోవడం కోసం
పాట్లుపడుతూ జాలిగా నాలో నిన్ను చూసుకుంటూ ...

నీకు దూరమైపోతున్నానేమోనని‌,
గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తుని ఊహించుకుంటూ...

మధ్యమధ్య క్షణాలలో 
మహాదేవా, నమఃశివాయ అనుకుంటూ 
ఏదోలా‌ ఉబుసుపోక కాలం వెళ్ళదీస్తూ ఉన్న నన్ను మన్నించు మహాదేవా శంకరా నను మన్నించు.

మహాదేవా శంభో శరణు.

Monday, November 27, 2023

శివోహం

శివ...
నీ చరణ సన్నిధే నా పెన్నిధి గా మార్చు ఈ జన్మకైనా మరే జన్మకైనా నీవే నా తండ్రివై తోడు నీడగా నడిపించి నీచెంతనే నిలిచేలా అనుగ్రహించు
ఆ భారము బాధ్యత నీదే హర.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!కోరచెప్పుల నూడ్చి పుక్కిట నీళ్ళు పోసి
ఆరగించగ నీకు మద్య మాంసములు  పెట్టు
జ్ఞాన అజ్ఞానములు నాకు లేవు మన్నించు
మహేశా . . . . . శరణు

శివోహం

శంకరా... 
శత సహస్ర నామాలతో అర్చించాలని తలచి
ఈ మూడు అక్షరాల వద్దే నా మనసు నిలిచి
వాటి మాధుర్యంలో ఓలలాడుతూ 
ముక్కంటిని తలుచుటకు ఈ మూడు చాలదా అని పరవశించింది...
ముల్లోకాల ఉనికి సైతం నిక్షిప్తమైన ఓంకారం 
నీ నామమే కదా.
మహాదేవా శంభో శరణు.

Sunday, November 26, 2023

శివోహం

ఉయ్యాల కి ఊరేగింపు కి మధ్యలో ఎన్ని బంధాలో...
ఈ ఊపిరి పోసినవాడు ఎవరు రేపు ఊపిరి తీసేవాడు అనే ఎరుక లెకుండా ఊపిరి సలపని బంధాలలో బందీ చేస్తావు...
నీవు గొప్ప మాయగాడివి సుమీ...
నీ మాయ ముందు మేము ఎంతటి వాళ్ళము...
ఈ మాయ నుంచి బయటకు వచ్చేలా అనుగ్రహించు తండ్రి....
నీకు శతకోటి వందనాలు...
మహాదేవా శంభో శరణు.

Saturday, November 25, 2023

శివోహం

శివా ! నిను గుర్తు చేసుకునే క్షణంలో 
నన్ను నేను మరిచిపోతాను 
నన్ను నీవు గుర్తు చేసుకునే క్షణం కోసం 
అనుక్షణం నీ కోసం నను నేను మరిచిపోతాను 
శివా ! నీ దయ

  https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! ఎప్పుడూ మూసి ఉండడానికి మూడు కన్నులెందుకయా ముక్కంటిశ... మాయలో మా కన్ను మూసుకొన్న...