Thursday, December 7, 2023

శివోహం

శివా!మా చూపు తిప్పి
లో చూపు మప్పగా
తెలియ వచ్చారా మీరిలా
మహేశా . . . . . శరణు .

Wednesday, December 6, 2023

శివోహం

శివా!తోలుతిత్తి రూపానికి పేరొకటుంది
పేరులేని తేజానికి రూపం లేకుంది
నేను నీవైతే నామరూపాల  పనియేముంది
మహేశా . . . . . శరణు .

శివోహం

లోక కళ్యాణం కొరకు నీవు గరళాన్నే మింగావు...
నాపాప క్షయానికి ఈమాత్రం బాధలు పడలేనా ఏంటి...
నాబాధలను నీనామ ప్రవాహం అదుపు చేయదా ఏంటి...
మహాదేవా శంభో శరణు...

Wednesday, November 29, 2023

శివోహం

శివా!నీ కంటిలోన మంట ఆరదు
నీ గొంతులోని విషము జారదు
నీ కరుణ కురియుట ఆగదు.
మహేశా . . . . . శరణు .

Tuesday, November 28, 2023

శివోహం

శివ...
జానెడు పొట్ట నింపుకోవడం కోసం
పాట్లుపడుతూ జాలిగా నాలో నిన్ను చూసుకుంటూ ...

నీకు దూరమైపోతున్నానేమోనని‌,
గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తుని ఊహించుకుంటూ...

మధ్యమధ్య క్షణాలలో 
మహాదేవా, నమఃశివాయ అనుకుంటూ 
ఏదోలా‌ ఉబుసుపోక కాలం వెళ్ళదీస్తూ ఉన్న నన్ను మన్నించు మహాదేవా శంకరా నను మన్నించు.

మహాదేవా శంభో శరణు.

Monday, November 27, 2023

శివోహం

శివ...
నీ చరణ సన్నిధే నా పెన్నిధి గా మార్చు ఈ జన్మకైనా మరే జన్మకైనా నీవే నా తండ్రివై తోడు నీడగా నడిపించి నీచెంతనే నిలిచేలా అనుగ్రహించు
ఆ భారము బాధ్యత నీదే హర.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!కోరచెప్పుల నూడ్చి పుక్కిట నీళ్ళు పోసి
ఆరగించగ నీకు మద్య మాంసములు  పెట్టు
జ్ఞాన అజ్ఞానములు నాకు లేవు మన్నించు
మహేశా . . . . . శరణు

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...