Friday, February 16, 2024

శివోహం

ఉన్నాడు  ఒకడున్నాడు
ఈ సర్వం జగత్ వ్యాపించి శివుడు  ఒకడున్నాడు.  
శివుణ్ణి చూడాలంటే ఎన్నో సుడిగుండాలు  దాటాలో మరి.  
శివుడు అనుగ్రహిస్తే ఏదో ఒక దేహం తో దర్శనమిస్తాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

Thursday, February 15, 2024

శివోహం

మనిషి లోపలున్న చీకటిని కూడా తొలిగించే సూర్య భగవానుడు!
విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే!

ఓ సూర్యా! సహస్రాంశో తేజోరాశీ జగపతే 
కరుణాకరే దేవ్ గృహాణాధ్య నమోస్తుతే.

రథసప్తమి శుభాకాంక్షలు.

శివోహం

శివా!సగం దేహం పంచి
సగం దేహం వుంచి
అంతా నీవేనంటే తెలిసేదెలా..?
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
ఆట మెుదలెట్టడం వరకే
నా పని...
ముగింపు నీ దయ.
ఈ ఆట ఆడిచడం నీ చతురత.

శివ నీ దయ.

Wednesday, February 14, 2024

శివోహం

సద్గురు శ్రీశ్రీశ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 285 జయంతి సందర్భంగా యావత్ బంజారా  బంధు మిత్రులకు అందరికీ సేవాలాల్ జయంతి శుభాకాక్షలు...
గురు దేవుని ఆశీస్సులూ మనకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.

జై బుడియాబాపు 
జై జగదాంబ మా
జై తుల్జాభవాని
జై జై సేవాలాల్ మహారాజ్

శివోహం

రూపాయి ముడుపు కట్టి లక్షలు కోరేవాణ్ణి కాదు
ఒకే ఒక  కోరిక తండ్రి తెలిసీ తెలియక తప్పులెన్ని చేసినా 
నన్ను అక్కున జేర్చుకో నీ చెంత నిలుపుకో.
శివ నీ దయ.

శివోహం

శివా!బ్రతుకు ఏమిటో తెలిసేది 
బ్రతుకేమిటో తెలిపేది 
ఈ జ్ఞాన వాకిటే....
మహేశా . . . . . . శరణు

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...