Friday, April 26, 2024

హరే గోవిందా

మదిలో భావాల స్వప్న నిధి...
సకల వల్లభ కళా నిధి...
భక్త వరద దయా నిధి...
నీ దర్శనం మరువనిది...
నీ అభయం తరగని నిధి...
నీ లడ్డు తియ్యనిది...
నీవే మాకు పెద్ద పెన్నిధి...

హరే శ్రీనివాసా...
హరే గోవిందా...
ఓం నమో వెంకటేశయా...
ఓం నమో నారాయణ
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

భోగం అంటే పరమాత్మ సన్నిధి…
భాగ్యం అంటే శాంతి...
భోగభాగ్యాలు అంటే పరమాత్మ సన్నిధి లో లభించే శాంతి.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

జననమన్నది రోదన...
మరణమన్నది యాతన…
మరి నడి మధ్యన ఉన్నది...
సుఖమా?...
సంతోషమా?...
శాశ్వతమా?...
ఎరుక తెలిసిన నా నాధుడువి నీవు ఎరుక పరచవయ్య కైలాసాగిరి వాసా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!తెలుపు నలుపున నీవు తెలియవచ్చేవు
నలుపులో తెలుపును చూడ చెప్పేవు
ముక్కంటి చూపున జ్ఞానమిచ్చేవు
మహేశా . . . . . శరణు .

Thursday, April 25, 2024

శివోహం

శివా!ఎగుడు దిగుడు కళ్ళు ఏమి అందమో
గొడ్డు తోలు కట్ట ఏమి ఆనందమో
ఎరుక చేయి నాకు నీ ఎఱుకనిచ్చి..
మహేశా . . . . . శరణు .

శివోహం

అన్నీ విడిచి వచ్చినపుడు 
అక్కునచేర్చుకొని ఆదరించువాడు 
ఆ శివుడే ..

Saturday, April 20, 2024

శివోహం

శివా!తొలినాళ్ళలో నీకు జోతలన్నాను
మలినాళ్ళలో  మెలగ దండాలన్నాను
ఇన్నాళ్ళకు సర్వం సమర్పణమన్నాను
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...