Monday, April 29, 2024

శివోహం

*న* నమకం చమకం లింగాష్టకం...
*మ* మధురం వికసం కైలాసం...
*శి* శివోహం బ్రహ్మం కపాలం...
*వా* వాహనం నందిమ్ ఉల్లాసం...
*య* యదార్థం భస్మం జీవనం.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివ!
నా ఈ పయనం…

సాగే జీవన పయనం
ఊగే ఊహల శయనం
ఆశ నిరాశల లోలకం
నా ఈ పయనం…
ఎల్లలు ఎరుగని పయనం
కల్లోల కడలికి వయనం

లోక అలోకాల  సంధానం

పాప‌ పుణ్యాల  సావధానం
జనన మరణ  సాగరం.


మహాదేవా శంభో శరణు.


Sunday, April 28, 2024

శివోహం

శివా!భాగించినావు నీ దివ్య తేజం
భాసించినావు అందుయిందు
శేషించు చున్నావు సర్వమందు
మహేశా . . . . . శరణు

శివోహం

శివ!
ఎదురు చూస్తూనే ఉన్నాను.
చూస్తున్నాను…
చూపునే చరమగీతము గా చేసి ఎదురు చూస్తూ ఉన్నాను.
నీ దర్శన భాగ్యానికై….
మనసును తైలము చేసి…
కనులను ప్రమిదలు గా చేసి
ఎదురు చూస్తూ ఉన్నాను...
నీ దర్శన మైతే...
సేవకుడినై…
విశేషకుడినై...
బుణ విముక్తుడి నవుతా.
మహాదేవా శంభో శరణు.

Saturday, April 27, 2024

శివోహం

శివ!
నా ఊపిరికి నీకు మాత్రమే తెలుసు..
నా ఉచ్ఛ్వాసనిశ్వాసల్లో దాచుకున్న అసలైన రహస్యం.

శివ నీ దయ.

శివోహం

శివా!ముట్టడి చేయగ నిన్నెవరైనా
కట్టడి చేయుట నీవు కచ్చితము
నిప్పూ నీరే అందుకు నిదర్శనము
మహేశా . . . . . శరణు .

శివోహం

నా అనుభవము...
అవసరమును మించినది శక్తికి మించినది ఏదైనా భారమే ప్రమాదమే...
నీలో నువ్వు ఆలొచించి చూడు...
నీతో నువ్వు మాట్లాడి చూడు నిజమో కాదో తెలుస్తుంది...
నిజం తెలిసినా నీవు అంగీకరించలేవు....
ఎందుకంటే మాయ చాలా శక్తివంతమైనది...
నిన్ను అంత వేగంగా మారనివ్వదు...
నీ అంతర్మధనంలో అనాదిగా దాగి ఉన్న కొన్ని ప్రశ్నలకైనా ఈ రోజు నీకు సమాధానము దొరికింది కదా మిత్రమా.

ఓం నమః శివాయ.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...