Tuesday, April 30, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ...
ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ....
అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ...
అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు...
అమ్మే ప్రత్యక్ష దైవం...
అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
సత్యము నీవే
నిత్యము నీవే
ఇహము పరము నీవే
నా మతి నీవే నా గతి నీవే
నా అతి పతి నీవే 
ఆత్మవు నీవే ఆత్మ లోని పరమాత్మవు నీవే
ఆశల పాశలు నీవే
గురువు నీవే స్వామి
గురువుకి గురువూ నీవే
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివోహం

ఓ శివా! పరమేశ్వరా! ఆదిభిక్షూ! 
నా మనస్సు అనే కోతి ఎల్లప్పుడు...
మోహమనే అడవిలో తిరుగుతూ....
కామము అనే కొండలపై విహరిస్తూ....
ఆశలనే కొమ్మలపై ఆడుతూ ఉంటుంది.....
అత్యంత చపలమైన ఈ కోతిని.....
భక్తి అనే త్రాటితో గట్టిగా కట్టి....
నీ అధీనములొ నుంచుకొనుము...
మహాదేవా శంభో శరణు....

Monday, April 29, 2024

శివోహం

శివో
మహేశ్వరః
శంభుః
పినాకీ
శశిశేఖరః
వామదేవో
విరూపాక్షః
కపర్దీ
నీలలోహితః
ఓం నమః శివాయ.

శివోహం

శివా!మరణాన్ని తలపించే జన్మలొద్దు
జన్మలు తొలగేలా మరణమీయి
ఏదైనా నీకు సాధ్యమే ఏమీ అనుకోకు
మహేశా . . . . . శరణు .

శివ ని5 దయ

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...