Thursday, May 16, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
అజ్ఞానాన్ని తొలగించకుండా...
మానసిక బలహీనతల్ని అధిగమించకుండా ఎవరూ భవసాగరాన్ని దాటలేరు, విముక్తి పొందలేరు...
ముక్తి అనేది మరణించాక వచ్చేది కాదు...
బతికుండగానే సంపాదించుకోవలసినది.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నీతలపే నా బలం...
నీ నామమే నాకు వరం...
నీ చూపులే నాకు మార్గం...
నీ మౌనమే నాకు సంకేతం...
నీ కరుణయే నాకు అర్హత...
నీ సేవయే నాకు ఆరాధన.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!ఉత్కృష్టమైన నీ నామము సహా
ఉచ్ఛిష్టమైనవే అన్నీ ఈ జగతిలో
నీకేమి  అర్పించాలో నాకేమి ఎఱుక 
మహేశా . . . . . శరణు .

Wednesday, May 15, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!

దీనుడను నేను సకల జీవుల రక్షకుడవు నీవని నమ్మి మీ చరణారవిందములు చేరితిని కరుణాకరుడవు నీవని...
నమ్మి మొక్కులు మ్రొక్కితి బోళాశంకరుడవని..
హృదయ మందిరంలో ఉండునట్లు దీవించు తండ్రి.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!
శివశక్తి స్వరూపులైనా మీరే సృష్టికి మూలం...
అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకలై అన్యోన్య దాంపత్యానికి సంకేతాలై...
ఇలలోని జంటలకు ఆదర్శవంతులై జగతికి తల్లిదండ్రులు మీరేనయ్యా...
లయకారునివి నీవై జగన్మాత శక్తి స్వరూపిణియై  లోకాలనేలే ఆత్మ బంధువులై...
అమ్మ జగన్మాత ప్రకృతి అయి అండగా ఉండే తండ్రి మహాదేవుడు గా నీవై ఉన్నవయ్య.
శాసించేది అమ్మ ఆడించేది ఏమో మీరు.

మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...