Sunday, June 21, 2020

జననం మరణం

తోడు దొంగలు ఇద్దరు తెలుసుకొనుమా
విశ్వమంతయు వారె ఏలుచుండ

కవల పిల్లలుగ జనన మరణములు
ఏక గర్భ వాసాన ఎదుగుచుండి
ఏక కాలాన రెండు జన్మనొందు
తీరు తెన్నులు ఏవి తెలియకుండు

రెండే రెండు యాతనలు కలవు జీవితాన
ఒకటి జన్మ యాతన నిన్ను జగతికంపు
రెండు మరణ యాతన నీ బంధాలు తెంపు
వేరు యాతనలన్ని ఒట్టి వాదాలే సుమ్మా

విచారించగ నీకు తెలియునయ్యా
ముందు వెనుకల రెండు మసలు చుండు
కలకాలము అవి రెండు కలసి ఉండు
విషయమెరిగిన  వ్యధ దూరముండు

No comments:

Post a Comment

  శివ! ఎన్నాళ్లని చూడాలి... నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి... కర్మ శేషం కొరకు కాలం తో పయనం ఇంకెంత కాలం. శూన్య స్థితం కొరకు జీవ...