Sunday, June 21, 2020

శివోహం

ఎరుక కలిగెను నాకు ఎదను నేడు
తృప్తి నొందితి నేను తెలియగాను

 నమఃశివాయ నమః హరాయ

ఒక్కటైయిన జగతిలో ఒక్కడే శివుడు
రెండుగా రూపించు రేడు ఈ శివుడు
మూడు లోకములేలు ముక్కంటి శివుడు
నాలుగు వేదాలు కలగలుపు శివుడు

ఐదు అక్షరముల మంత్రమే శివుడు
ఆరు చక్రాల పైవెలుగు శివుడు
ఏడు ఏడు లోకాల ఏలిక ఈ శివుడు
ఎనిమిది మూర్తుల ఏకమే శివుడు

తొమ్మిది గ్రహాలకు తలకట్టు శివుడు
పది దిక్కులందు ప్రభవించు శివుడు
పది నొకటి రుధ్ర స్వరూపమే శివుడు
పది రెండు లింగాల వెలిగేది శివుడు

శివుడు శివుడు శివుడు
మహేశా.....శరణు.....

No comments:

Post a Comment

  శివ! ఎన్నాళ్లని చూడాలి... నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి... కర్మ శేషం కొరకు కాలం తో పయనం ఇంకెంత కాలం. శూన్య స్థితం కొరకు జీవ...