Sunday, June 21, 2020

ఓం

**భగవంతుని  భావమే మాయ . మాయ యొక్క కర్మాచరనే సృష్టి .
భగవంతుని భావం ఆగితే మాయ ఆగుతుంది . మాయ ఆగినప్పుడు 
సృష్టి అందులో లయం అవుతుంది . మనం మన భావాన్ని ఆపుట 
ద్వారా సృష్టిలో కాక , బ్రహ్మం లో ఉంటున్నాము . అంటే భావంగా 
ఉండక , మౌనం గా ఉండాలి . అట్టి స్థితి కాలాతీతమై కాలచక్రంలో 
పడనివ్వదు .
**అవ్యక్తం వ్యక్తమైతే అది సృష్టి . వ్యక్తం అవ్యక్తమైతే అది లయం . 
అందుకే అంతర్ముఖం అవ్వమనేది . ఎందువల్ల ? నీ దిశా మారితే 
స్థితి మారుతుంది . నీవు ఎటునుండి ఎటుకి వెళ్ళీనా , స్థితి మాత్రం 
ఒకేలా నడిపిస్తుంది . నీ సుఖం ఎటు ఉందొ , అటు నడిడిపిస్తుంది .
కావున అంతార్ముఖ జీవితం లో స్థితి మోక్షం కేసి సాగి బ్రహ్మంలో 
లయమౌతాడు .
**యోగులు జీవిత పరమార్ధాన్ని గ్రహించమని చెబుతారు . అంటే 
నేను ఎవరు ? ఎక్కడ నుండి వచ్చాను ? ఎక్కడికి వెళుతున్నాను ?
నా గమ్యం ఇదేనా . ఈ నిత్యా విధులు కాదు నా జీవితం . యింకా 
ఏదో ఉంది . పుట్టడం బ్రతకడం చావడం కాదు .యింకా ఏదో 
తెలుసుకోవలసింది ఉంది . ఉన్నాడనే  ఆలోచన జీవిత పరమార్ధాన్ని 
చూపుతుంది .
**ముందు మన స్వరూపాన్ని గుర్తిస్తే , యితరులు కూడా నా 
స్వరూపాలేనని తెలుస్తోంది . స్వరూపం అఖండ తత్వమని 
తెలిస్తే , భిన్నత్వం నశిస్తుంది . అపుడింక వేరుగా దర్శించలేము .
అంతా నేనుగా ఉంటాము . 
**ప్రపంచానికి , జీవితానికి  చలనం లేలనివాడు పనికి రాడు .
కావున చలనాన్ని చంపుకొని నిశ్చలత్వాన్ని పెంచుకొని , 
జీవునిగా నటించు కొరకు చాలించాలి . నిశ్చలంగా లోపల 
జీవించాలి .బాహ్యం లో జీవిస్తే , అంతరంగం లో నీకు యిచ్చిన 
సమయం వృధా అవుతుంది .
**స్వరూపం అంటే కేవలం తానె ఉండటం . యిది సరిపోదు . 
బురద లో ఉన్న కమలం నేను బురద లో ఉన్నానని తెలుసు 
కొన్నంత మాత్రాన సరిపోదు . అచట నుండి దైవ సాన్నిధ్యం చేరే 
మార్గం చూపాలి . అట్లే  నేను బ్రహ్మ స్వరూపాన్ని అని అంటే 
చాలదు . అనంత బ్రహ్మ సాన్నిధ్యాన్ని చేరాలి . అలా జరగాలంటే 
నీవు అరూపుడవుడ్ కావలి . అంటే కేవలం స్వరూప స్థితి 
మాత్రమే మిగిలి , దేహ సంబంధమైన ఉనికి కొంచెం కూడా 
లేకుండా తయారవ్వాలి . అప్పుడే అన్నీ రూపాలలో ఉన్నది 
నేనే నాని గుర్తిస్తావు . ఆ అనంత తత్వాన్ని అనుభవిస్తావ్ . 
**నామరూపధారునికి  స్వరూప శక్తి లేకపోతె , నిరాకారాన్ని 
చేరలేడు . నిరాకారునికి నామరూప ధారణ లేకపోతె నిరాకారాన్ని 
తెలుపలేడు . కావున రెండు గొప్పవే . రెండు ఒక్కటే . కానీ 
మూలం నిరాకారం . అధిపతి నిరాకారం . కావున దాన్ని
 చేరుకున్నాక నే సాకారం గొప్పదవుతుంది . రెండు ఒక్కటే నాని 
అర్ధమౌతుంది .
**నాకు జ్ఞానం రావాలని భావించే కన్నా , నాలో ఉన్న అజ్ఞానం 
పోవాలని భావించడమే మిన్న .
**ప్రపంచం లో తనను తానూ పోల్చుకొని చుస్తే , వాడు జీవుడు .
తనలో ప్రపంచాన్ని చూడగలిగితే వాడు దేవుడు .
**నీవు చెప్పినది జ్ఞానం కాదు . నీవు నడచినదే జ్ఞానం .
**బ్రహ్మమును తెలుసుకొంటే తీను ఉండడు . తనని ఉండనిస్తే 
బ్రహ్మం ఉండదు ., తనని తానూ తెలుసుకొంటే , బ్రహ్మమును 
తెలుసుకొంటాడు . బ్రహ్మాన్ని గుర్తిస్తే , తన్ని తానూ వదిలేస్తాడు .
**సాకార రూపాలు , నా హృదయం లో ధర్మమనే పీఠం 
వేసినపుడు  అవి నిలుస్తాయి . నిరాకార బ్రహ్మం నకు ధర్మం 
సరిపోదు .తనకై సర్వ ధర్మాలను ఆంతర్యం లో త్యాగించి ,
నీవే నేను అను భావము తో ఖాళీని ఏర్పరచినపుడు , 
నిరాకార బ్రహ్మము స్తిరపడతాడు .
**మనిషి అబద్దపు నేను , బ్రహ్మ నేను కలసిపోయి ఉండి ,
ఆ అబద్దపు నేనునే , సత్య నేనుగా నమ్మి , భ్రమ తో వ్యవహరిస్తూ 
ఉంటాడు . బ్రహ్మ జ్ఞానం తో సత్య నేను తెలియబడుతుంది . 
సత్య నేను ను అనుభవం గా గుర్తిస్తే తప్ప భావం అబద్దమని 
నమ్మడు . భావం అబద్దమని గ్రహిస్తే , బ్రహ్మ యదార్ధం స్థిర 
పడుతుంది . భావము , బ్రహ్మము , మధ్య జరిగే యుద్ధం లా 
చివరికి నిశ్చల బ్రహ్మమౌనమే  సత్యమని అంగీకరిస్తాడు . 
నీ భావమే నీకు ఆటంకం తప్ప అన్యం కాదు .
**ధ్యానం అంటే , బలవంతంగా ఆలోచనలను ఆపుతూ , లోపల 
ఖాళీని ఉంచుకోవడమని అనుకొంటాము . కానీ ధ్యానమంటే , 
మనం అంతవరకూ చుసిన నామరూపాలు మరచిపోయి , 
సృష్టిని , బ్రహ్మంగా , యింకా వీలయితే , సృష్టి ..దృష్టికి రానంత 
ఖాళీగా భవిస్తూ , ఆ ఖాళీ లో నువ్వు ఆసీనుడవై , అందులో 
మునిగి ఉన్నట్లు గుర్తించాలి . లోపల ఉన్న ఆలోచనలను 
ఎందుకు రానివ్వకూడదంటే , అవి నిన్ను కాల్లీలో కూర్చొన్న 
అనుభూతిని పొండనివ్వవు . అదే కాక నీ చుట్టూ , నామ 
రూపాలను సృష్టిస్తాయి  . కావున లోపల మౌనం వహించి 
బయట ఖాళీలో చరించాలి . అదే నీవు ఉండాల్సిన యదార్ధ 
స్థితి . కానీ జీవితం కోసం నేత్రాలతో భిన్నంగా చూడవలసి 
వస్తుంది . జన్మ రాహిత్యం కోసం నేత్రాలు మూసి ,అభిన్నత్వాన్ని 
దర్శించి , అందులో మునిగి ఉన్నందువల్ల సత్య మెరిగిన 
వానిని భిన్నత్వం బంధించదు . 
**తనని తాను గుర్తించుకొని చేసే కర్మ బంధించదు . తనను 
మరచి చేసినది  బంధించును . అనగా కర్మ ఫలితము ఏదైనా 
గానీ , అనుభవించాలి . అనుభవించుటకొరకు జన్మనెత్తాలి . 
స్వరూప ఎరుకే మోక్షం .
**మనస్సును మౌనంగా ఉంచుకోవడమే మన లక్ష్యం . 
మనోమౌనం మనస్సును అట్నార్ముఖం చేసి బ్రహ్మం నందు 
లయమయినపుడు వస్తుంది .
**అంతఃకరణ శుద్ధంగా ఉన్నపుడే మనో మౌనం వస్తుంది .
మనస్సు సిద్ధం అయి  బ్రహ్మంగా ఉన్నపుడు జన్మ లేదు .
బ్రహ్మమే మౌనము . చిద్విలాసంగా చిదాత్మగా ఉండాలి .
**నేను అనంతమైన బ్రహ్మమును . నేను మీలో ఉన్నాను . 
దేహ నేను ను తొలగిస్తే , నేను గోచరిస్తాను . నేను విస్తరించే 
ఉన్నాను . నా విస్తీర్ణతని ఎవరు గ్రహింతురో , వారిని నేను 
నడిపించెదను . మీలో గల నేను తొలగాలంటే , నేను 
బ్రహ్మమును అని ధ్యానిస్తూ  మౌనంగా ఉండాలి . 
**చలనం ఆలోచనలకు బలం . మౌనం ఆలోచనల యొక్క 
మరణం . ఆ మరణం లో నే మీ అమరత్వం దాగి ఉన్నది . 
ఆ స్థితి నేను ఐ ఉన్నాను . ఆ స్థితే మోక్షం ఐ ఉన్నది .
**దేహభావం తో ఉన్నదంతా పరిమిత తత్త్వం . ఈ పరిమి 
తత్త్వం  అపరిమిత  తత్వాన్ని మూసివేసినది . నేను , నాది లో 
బంధించి వేసినది . బ్రహ్మ భావం తో , బందిఖానా ని 
తెంచుకొని , హృదయ విశాల తత్వాన్ని పెంచుకోవాలి .
నేను నాది తొలగినపుడు , ఉన్నది విశాల తత్వమే .
అదే బ్రహ్మయే స్థితి .
**అన్నీ చేస్తున్నాను , దేని యందు చిక్కక ఉండువాడు అకర్త .
అకర్త గా ఉండుటకు అభాసించుట ఏ  బ్రహ్మ జ్ఞానము . 
మనస్సులో భావం రాకుండా జీవితం నడవదు . భవం వస్తే , 
మోక్షం రాదు . ఈ మధ్యన రెండింటినీ సాధించుకొనేదే బ్రహ్మవిద్య .
**భావమే జీఇతణ్ణి నడిపిస్తుంది . ఆ భావాన్ని బ్రహ్మమే 
నటింపజేస్తున్నదని గుర్తించి , ఆంతర్యం లో ప్రతీ క్షణం కర్త్రుత్వం 
నుండి తప్పుకోగలగాలి . అదే భావాతీత స్థితి . అదే సాక్షిత్వమ్ .
అదే ఆకర్త్రుత్వం . భావం బంధం అవుతుంది కాబట్టి భావాన్ని 
సాక్షిగా చూడాలి . 
**బ్రహ్మార్పణం .

No comments:

Post a Comment

  శివ! ఎన్నాళ్లని చూడాలి... నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి... కర్మ శేషం కొరకు కాలం తో పయనం ఇంకెంత కాలం. శూన్య స్థితం కొరకు జీవ...