Sunday, June 21, 2020

బాలాజీ

గోవింద నామ స్మరణతో అన్ని దిక్కలు
మారుమ్రోగుతున్నాయి గుండె ఘోషలు

అడుగులోన అడుగు వేస్తూ గోవిందని స్మరిస్తూ
కొండలెక్కుతున్నాము నీ గుడిని చేరగా
అడుగు భారమనిపిస్తే గోవింద స్మరణమే
బతుకు భారమైపోతున్నా గోవింద స్మరణమే

ఆనంద నిలయాన  చూడ గోవింద స్మరణమే
ఆనందానుభూతుల గోవింద స్మరణమే
ఏ దిక్కును చూస్తున్నా గోవింద స్మరణమే
ఏ దిక్కూ తోచకున్న గోవింద స్మరణమే

తల వాకిట నుండి నిన్ను  తలచుకుంటు వచ్చి
తొలి గడప నుండి నిన్ను తేరిపారా చూసి
కదలలేక మెదలలేక కళ్ళు అప్పగిస్తూ
తలపులోన నిలుపు కొనగ తపన పడుతున్నా

గోవిందా....... గోవిందా .......గోవిందా......

No comments:

Post a Comment

  శివ! ఎన్నాళ్లని చూడాలి... నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి... కర్మ శేషం కొరకు కాలం తో పయనం ఇంకెంత కాలం. శూన్య స్థితం కొరకు జీవ...