Thursday, June 25, 2020

శివోహం

నీవు లేని నాడు
నిర్జీవమయ్యే జీవాత్మ 
నాదే అని ఎలా చెప్పను

నీవు మరుగైన నాడు 
ఈ పార్థివ శరీరం 
పంచభూతాత్మకమని  ఎలా చెప్పను

చివరికి మిగిలే 
నాదైన నీ ఆస్థి అస్థికల  బూడిద 
నీవే పూసుకుంటావని ఎలా చెప్పను

అందరినీ వదిలిస్తూ 
నన్ను నీవు  పిలుస్తూంటే 
నీవు ఎందుకు వచ్చావని 
నిన్ను నేను అడగను 

నీవు కూడా 
నీ కుటుంబాన్ని వదలి
నా కోసమే వచ్చావని 
నాకు బాగా తెలుసు తండ్రీ

శివోహం  శివోహం

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...