Sunday, June 21, 2020

శివోహం

చిన్న చిన్న మాటలలో చెపుకుందాము
చిత్తంలో చిరు దీపం తెలుసు కుందాము

ప్రతి రోజూ పూజచేయు విధము తెలుసుకో
ఆ విధానాన్ని నిదానంగా అర్ధం చేసుకో
అర్ధమవగ పదార్ధాల ప్రధాన్యత తగ్గించుకో
యదార్ధాన్ని తెలుసుకొన ప్రయత్నించుకో

ఇష్ట దైవ రూపాన్ని ఎదుట నిలుపుకో
ఆ స్పష్టమైన రూపాన్ని ఎదను నిలుపుకో
ఎన్నెన్ని రూపాలు ఎదురుగ ఉన్నా 
నీ దైవానికి  ప్రతి రూపాలని ఎరుక పెంచుకో

అనంతమైన రూపాన్ని అర్చించగ తరమా
అన్నీ తానైనవానికి అర్పించగ వశమా
అందరిలో ఆత్మగా అమరిన విశ్వాత్మను
విచారించి నీవు  వివరంగా తెలుసుకో

ఏక చింతనలో  ఏకాగ్రత పెంచుకోవాలి
కనులు మూసుకొని నీవు చీకటిలో మునగాలి
చిక్కనైన చీకటిలో చిరు దివ్వెను చూడాలి
చిత్రంగా ఆ దివ్వె నీ ఎదుట స్థిరమవ్వాలి

No comments:

Post a Comment

  శివ! ఎన్నాళ్లని చూడాలి... నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి... కర్మ శేషం కొరకు కాలం తో పయనం ఇంకెంత కాలం. శూన్య స్థితం కొరకు జీవ...