Sunday, June 21, 2020

ఓం

చూడు చూడు చిత్రం కెరటాల తీరు విచిత్రం
ఎగిరి ఎగిరి పడుతుంది ఏకంగా కూలుతుంది

కడలి తాను వేరని కెరటానికున్న భావనతో
ఎగిసి ఎగిసి వేగంగా తీరానికి సాగుతుంది
క్షణమైనా నిలువలేక కడలి ఒడిని చేరుతుంది
కానరాని ఆ కెరటం  ఉనికిని కోల్పోతుంది

అనుక్షణం అదేపనిగ  వీడాలని అనుకున్నా
ఆరాటం అనుకున్నా ఆ భావన తప్పని
తనలోని తీసుకుంటు కడలి నచ్చచెబుతుంది
భేద భావమెందుకని ఆభేదాన్ని చాటుతుంది

మూలాన్ని విడిచి మసలేది ఎన్నాళ్ళు 
మూలాన్ని చేరుకొనుటే తిరునాళ్ళు
జీవమున్నదానికి ఇది జీవిత పాఠం
జనన మరణములు తెలిపే గుణపాఠం

No comments:

Post a Comment

  శివ! ఎన్నాళ్లని చూడాలి... నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి... కర్మ శేషం కొరకు కాలం తో పయనం ఇంకెంత కాలం. శూన్య స్థితం కొరకు జీవ...