Sunday, June 21, 2020

జై శ్రీమన్నారాయణ

మనిషి అజ్ఞానం ఎటువంటిదంటే, అతడు ఎన్నో కోరుకుంటాడు. వాటన్నింటినీ, దేవుడికి కానుకలిచ్చి తీర్చుకోగలనన్న భ్రమలో జీవిస్తుంటాడు. మొక్కులకు కోరికల చిట్టాను జతపరుస్తాడు. కొండకు, వెంట్రుకకు ముడివేసి లాగుతాడు.‘వస్తే కొండ వస్తుంది. పోతే వెంట్రుక తెగుతుంది. అంతే కదా’ అనుకుంటాడు. 
దేవుడితో ఎప్పుడూ ఎన్నడూ పాచికలు ఆడకూడదు. ఆయన చేతిలో మనిషే ఒక పాచిక. ఆ దైవంతోనే  ఆటలాడటం అంటే, అది ముందువెనకలు చూడని విపరీత సాహసం! భగవంతుడిది అనంతమైన శక్తి. దాని ముందు మనుషులు ఎంత? ఈ అవగాహన కలగనంతవరకు, వారికి  భగవంతుడు అర్థం కానట్లే!

No comments:

Post a Comment

  శివా!విశ్వమంత వెలుగులొ నీవు కానరావు అంతరాన చీకటిలో సాగకుంది నా పయనం గమ్యం చేరనీ గమనాన నీవే తోడుగా మహేశా . . . . . శరణు. వెలుగువో నా ముందు ...