Wednesday, June 30, 2021

శివోహం

సమస్తలోక మానవులు అది పూజగా కొలిచే శ్రీవిఘేశ్వరా...

గణగణ నాదంతో మా గణాంకాన్ని సరిచేసి సర్వ సిద్ధులను అనుగ్రహించు వరసిద్ధి ప్రదాయకాయ...

ఓం గం గణపతియే నమః

శివోహం

నిన్ను తప్ప అన్యుని తలవను పరమేశ్వరా
నీవే శరణు...
మహాదేవా శంభో శరణు

Tuesday, June 29, 2021

శివోహం

శివ...
నీ భక్తజన కోటి లో నేను ఒక్కడిని...
నన్ను ఓ కంట కనిపెట్టి ఉంచు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

ఎగసి పడే భాధనంత...
కంటనీరుగా కారకుండా.  
గుపెడంత గుండెలోన....
భద్రపరిచి దాచి ఉంచ...
నిన్ను అభిషేకించడానికి....
దాగలేనని అది అలల కడలిల...
ఉరకలేస్తూ పరుగుతీస్తూ...
మది భంధనాలను తెంచుకుంటు...
వాన చినుకుల కన్నుల నుండి కారుతుంది...
నీకెలా అభిషేకించను....
మహాదేవా శంభో శరణు...

శివోహం

నా శరీరంలో ప్రతి కణంలో జరిగే క్రియలు మీరే నడుపుతున్నారు శివ...

మీ అడుగులు నా అణువణువున
నడిపిస్తున్నాయి...

మీరండగా ఉండగా నా గుండె బలం కొండంత కాకుండా ఉండునా తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Monday, June 28, 2021

శివోహం

అందాలను చూపెట్టి మనసు వశం తప్పెలా చేసి....
పాపాల బందీలలో పడగొట్టి జీవితమే పరవశమయ్యేలా చేసి....
లోకమనే మైకంలో నను నెట్టి.....
అన్నీ నీవని ఆశపెడతావు....
ఆటబొమ్మలు చేసి అడుకొంటావు.....
ఏమిటి ఈ చిత్రము శంకరా....
ఎంత విచిత్రము నీ లీలలు...
శంకరా!!!నాలో ఆవరించి ఉన్న అరిషడ్వర్గాలు అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ ఆరు శత్రువర్గాలను చీల్చి చెండాడు...
నా చిత్తం నీకె సమర్పిస్తా  స్వామి.....
మహాదేవా శంభో శరణు...

Sunday, June 27, 2021

శివోహం

కనులారా నిన్ను చూసి
తరిద్దామని ఉందయ్యా 
నీ వేమో చూపుకే దొర్కక్క కానరాక ఉన్నావు...
నిన్నూ చేరుకునే సత్య ఉపాయము చెవిలో చెప్పి పోవయ్య మహేశా... 

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో...
నాకు ఆధారము నీవు మాత్రమే...
ఈ బంధాలు పెనవేసుకునేవే గాని విడిపించేవి గావు...
అసలైన స్వేచ్ఛ నీ దగ్గరే ప్రభూ...
మహాదేవా శంభో శరణు...

Saturday, June 26, 2021

శివోహం

హరిహార పుత్ర అయ్యప్ప....
అజ్ఞానమనే చీకటికి నీనామము చిరుదీపముగా వెలిగించి నీరూపము కొరకు వెదుకుచుండగ...
దారితప్పిన వేళ చేయూతనిచ్చి నీవైపు నడిపించు...
ఎంత చీకటిలోనైనా(కష్టంలో)నిన్ను వదలను...
మణికంఠ దేవా నీవే నా దీపానివి...
నా ఆరాధనయే నీకు దీపారాధన...

మహాదేవా శంభో శరణు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

దండము పెట్టుట నావంతు
తప్పుల రక్షణ నీవంతు 
ధర్మము పల్కుట నావంతు
అర్ధము చెప్పుట నీవంతు   
శ్రీహరి శరణు...
ఓం నమో వెంకటేశయా

Friday, June 25, 2021

శివోహం

త్రిశూలం 
త్రివర్ణం
త్రిముఖం 
త్రిపురం 
త్రిభావం 
త్రిశుద్ధం
త్రిలోకం 
త్రికారం 
త్రిగుణం 
త్రిశాంతం 
త్రిభాష్పం 
త్రినేత్రం

శివోహం... సర్వం శివమయం

Thursday, June 24, 2021

శివోహం

నీ శక్తి అంత ఇంత అనలేను 
సర్వ మంత నీదే తల్లి...
నీ దయకు అడ్డు లేదు...
నిన్నే మోము కొలుచు చున్నాము అమ్మగా...
శివుని వలే మాకు రక్ష నీవు...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః

ఓం గం గణపతియే నమః

సర్వ సిద్ధులను అనుగ్రహించే వరసిద్ధి ప్రదాయకాయ...
బుద్దిని ప్రకాశింపచేయు పరిపూర్ణ మూషికవాహనాయ...
యోగుల హృదయముల నందు ఉండే గజాననాయ...
సర్వలోకాలను సమదృష్టితో చూసికాపాడే విశ్వనేత్రాయ...
నీవే శరణు గణేశ నీవే శరణు...

రామభక్త శరణు

రామ నామం జపం చెస్తూ ఉంటె...
హనుమంతుడు మనకు సదా తోడు ఉండును కదా...

రామభక్త హనుమా శరణు...

శివోహం

శివా మహాదేవా...
దేవాదిదేవా...
శంభో స్వయంభో శంకరా... 
ఎన్ని సార్లు పిలిచాను... 
ఎన్ని సార్లు తలచేను... 
ఎంతగా కొలిచాను... 
అని ఏ లెక్కలు నిన్ను అడగను తండ్రీ. 
నా తప్పులన్నీ మన్నించు... 
నా తలపులో భక్తిని... 
నా పిలుపులో ఆర్తిని మాత్రమే చూడు తండ్రీ... 
నాపై దయచూపు దారిచూపు పరమేశ్వరా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

ఉచ్వాస వద్దన్నా వెంబడిస్తున్నది...
నిశ్వాస ఎలా చేయగలను శివ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

ఈశ్వరుని  నమ్మి చెడిన వారు లేరు....
ఎంత విశ్వాసమో అంత ఫలితం...
శివ నీ దయకు శతకోటి ప్రణామాలు తండ్రి...

ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, June 23, 2021

శివోహం

ఉచ్వాస వద్దన్నా వెంబడిస్తున్నది...
నిశ్వాస ఎలా చేయగలను శివ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

ఉచ్వాస వద్దన్నా వెంబడిస్తున్నది...
నిశ్వాస ఎలా చేయగలను శివ...
మహాదేవా శంభో శరణు...

Tuesday, June 22, 2021

శివోహం

బతకమని పుట్టుక ఇస్తావు...
బంధాల ఉచ్చులో విసిరేస్తావు...
కష్టాల సాగరంలో తోస్తావు...
బతుకంటే ఇది అని తెలిసేలోగా
నీ దగ్గరకు లాగేస్తావు...
నువ్వు ఆడే ఈ నాటకంలో నేను ఆట బొమ్మను...
అడలేను శివ ఈ ఆట ప్రతిసారి ఒడిపోలేను...
ఈ నాటకం ను ముగింపచేసి నన్ను గెలిపించు...
మాహాదేవా శంభో శరణు...

శివోహం

ఈశ్వరా...
పరమేశ్వరా...
నోరు నొప్పి పుట్టే వరకు...
నా మనసు సేద తీరే వరకు నీ నామమే జపిస్తున్న కదా...
నా పిలుపు విని...
నీ పిలుపు వినిపించు..

మహాదేవా శంభో శరణు...

Monday, June 21, 2021

శివోహం

త్రినేత్రా త్రిలింగ దేవా
త్రిశూల పాణీ పరమేశ్వరా...
పాపపరిహార పార్వతీపతి
మౌనము దాల్చావు
మాటాడను అంటావు
నీతో ఉండాలని నే వచ్చా...
మౌనంవీడి మాటాడు ఈశా
నీ మనసులోని భావాలు
నాకెలా తెలుసు
మహాదేవా శంభో శరణు...

Sunday, June 20, 2021

శివోహం

నిరంతర శివ నామ స్మరణే ముఖ్యమనీ 
త్రివిధ తాపం రక్షించేది పరమేశ్వరుడే అని తెలుసుకొన్నా...
శోక మోహ రాహిత్యమునకు శాస్త్రమనీ  
సంసార సాగరం దాటించేది మహాదేవా నీవేనని తెలుసుకొన్నా...
సంసార సాగరం దాటించు నీ వైపు దారి మళ్లించు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

సృష్టి, స్థితి, మరియు లయము లలో  నీవే పరమ సత్యము...
సత్యమునకు మూలము మరియు అంతము నీవే పరమేశ్వరా...
సమస్త సత్యమునకు సారము నీవే...

ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, June 19, 2021

శివోహం

విశ్వాసమున్న చోట ప్రేమ...
ప్రేమ గలచోట శాంతి...
శాంతి వున్న చోట సత్యము...
సత్యముగల చోట ఆనందమూ...
అక్కడే భగవంతుడు వుంటాడు...
శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారు.

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, June 18, 2021

శివోహం

జన్మమేదైనా...
పరిస్థితి ఏదైనా...
కలిమిలేములు సుఖదుఃఖాలు ఏవైనా...
మంచి చెడులు, పుణ్య పాపాలు ఏవైనా అంతా నీ చలవే...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...