Tuesday, January 31, 2023

శివోహం

శివా!దేహీ అంటున్నాను దేహంతో
పాహీ అంటున్నాను ప్రణతులతో
సోహం అంటున్నాను శ్వాసతో
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!మంగళములు కూర్చు నీపైన మనసు పెట్టి
ఎంగిలి కాని రీతి ఎలుగెత్తి పిలుస్తున్నా
 నీ పదములంటి ప్రణతులు అర్పిస్తున్నా
 మహేశా . . . . . శరణు .

శివోహం

నీ ఆశీర్వాదం లేకుండా...
కలియుగంలో నా మనుగడ సాగించడం చాలా చాలా కష్టం మణికంఠ...
నేను తినే ఈ నాలుగు మెతుకులు నీ బిక్షే...

హరిహర పుత్ర అయ్యప్ప శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!
ఈ శరీరం నీదయ
ఏది నాదయా అంతా నీదే కదాయా
నా ఊపిరి నీదే
నా ఊసులు నీవే
నా భావన నీదే
నా సాధన నీకే
నా నడకలు నీకే
నా నటనయు నీదే
నా గానము నీకే
నా ధ్యానము నీదే
నాదన్నది నీదే
నా కున్నది నీవే
మహదేవా శంభో శరణు.

శివోహం

చూడు అటుచూడు 
ఆ కనిపించేది పరమేశ్వరుడి వాసము 
జగత్ మయము 
మనస్సు ను సంతృప్తి పరిచే కైలాస మందిరము...

ఓం శివోహం....సర్వం శివమయం.

Sunday, January 29, 2023

శివోహం

శివా!
ఈ శరీరం నీదయ
ఏది నాదయా అంతా నీదే కదాయా
నా ఊపిరి నీదే
నా ఊసులు నీవే
నా భావన నీదే
నా సాధన నీకే
నా నడకలు నీకే
నా నటనయు నీదే
నా గానము నీకే
నా ధ్యానము నీదే
నాదన్నది నీదే
నా కున్నది నీవే
మహదేవా శంభో శరణు.

శివోహం

శివా!నీవు కొంత నాకు తెలిసావు
మరి కొంత తెలియమన్నాను
తెలియవస్తావో,నన్ను తరలిస్తావో
మహేశా . .   . . శరణు .

శివోహం

ఆదిమధ్యాంత రహితుడు....
నిర్వికారుడు...
బ్రహ్మాది దేవతలకు ప్రభువు...
సర్వలోకాలకు నియామకుడు...
సర్వవ్యాపకుడు అయిన పరమేశ్వరుదీని నిరంతరం స్తుతించటం వల్ల సకల దుఃఖాలు తొలుగును..

ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, January 28, 2023

హరిహారపుత్ర అయ్యప్ప శరణు

నీ స్మరణ...
నీ అర్చన...
భావన...
సేవనం తో నిరంతరం పూజించి తరించే నీ పరమభక్తులకు ఎల్లపుడు జయమంగళమే మణికంఠ.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

పరమ శివుడి పంచ ముఖాలు పంచ భూతాలకు, పంచ తత్వాలకు ప్రతీకలు...
లోక కంటకుడైన త్రిపురాసురులనే రాక్షసులను సంహరించడానికి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములనే పంచ ముఖాలతో త్రిశులాన్ని చేత ధరించి ఆ రాక్షసులను సంహరించిన పంచముఖ శివుడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, January 27, 2023

శివోహం

తలపులు కొలదుల భజింతురు 
నిముషము మనసున సేవింతురు
ఘనమని తలచిన ప్రేమింతురు  
మరువను మనసున వెంకటేశా 

శివోహం

శివ...
నువ్వు సర్వేశ్వరుడివి...
భక్తులందరికీ ఆరాధ్యదేవుడవు...
నువ్వు కానిది ఏదీ ఈ లోకంలో లేదు...
ఒకే ఒక కోరిక తండ్రి...
నా దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని హరించే నీ పాదపద్మముల సన్నిధిని నాకు ప్రసాదించు....
నా లోని ఆర్తిని, దీనత్వాన్ని తొలగించే నీ కృపాద్రుష్టిని నాపై వర్షింపచెయ్యి తండ్రి...
మహాదేవ శంభో శరణు

Thursday, January 26, 2023

శివోహం

ఈ ప్రపంచాన్ని పాలించేవారు ఒకరు వున్నారు.
ఆయనే భగవంతుడు.
పాలించడమే కాదు, భరిస్తున్నది కూడా ఆయనే.
మనం భరిస్తున్నామనుకోవడం వెర్రితనం.
పరమేశ్వరుడే సకల భారాలను భరిస్తున్నాడు.
కానీ, నీవు 'నేను భరిస్తున్నాను' అని అనుకుంటున్నావు.
నీ బాధ్యతలు, భారాలూ భగవంతునిపై వుంచి
నీవు నిశ్చింతగా వుండు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!భక్తి కలిగి కోరుకుంటి నీదు స్నేహము
ముక్తి నడుగ చేయలేను నేను సాహసం
నీ సాయుజ్యం అందించు అదే నాకు చాలును
మహేశా . . . . . శరణు.

శివోహం

నా మనసు నీ తలపులపై నిలవగా...
నీ నామము మననంతో మౌనం అలవడి...
అనుదినం నీరూపు రేఖల విభూతిని...
అనుభూతిగా ఆనందించు చున్నాము..
అలానే నా మదిలో స్థిరంగా నిలిచిపో పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

Wednesday, January 25, 2023

శివోహం

అంతులేని బంధనాల్లో మనిషిని యిరికించివేసి ఎన్నోవిధాలుగా యిబ్బంది పెట్టే ఆశల పాశాలను తునాతునకలు చెయ్యగలిగేది వైరాగ్యం. .
వైరాగ్యం పదునైన కత్తి మణికంఠ నీ నామ స్మరణ ఒక్కటే.

హరిహారపుత్ర అయ్యప్ప శరణు.

శివోహం

అమ్మ బిక్ష నా జీవనయానం...
బిడ్డకేది క్షేమమో తల్లికి మాత్రమే తెలుసు..
కంటికి రెప్పలా బిడ్డలను కాపాడుకోవటం మాతృమూర్తిస్వభావం...
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే...
అమ్మ మాయమ్మ దుర్గమ్మ శరణు.

ఓం శ్రీమాత్రే నమః
ఓం దుర్గాదేవినే నమః
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

శివా!కనులెదుటి లింగానికి కర్మాభిషేకం
మనసులో లింగానికి స్మరణాభిషేకం
విశ్వలింగానికి నీ విభూతులే అభిషేకం
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో శంకరా...
శివ శంభో శంకరా...
అనంత జీవ ముఖ బహు విధ రూపేశ్వరా...
విశ్వ శరీరాకృత ఓంకార నాద అర్ధనారీశ్వరా అద్వైత్వ అపూర్వ అఖిలేశ్వరా...
మహాదేవ శంభో శరణు.

Tuesday, January 24, 2023

హరిహారపుత్ర అయ్యప్ప శరణు

హరిహారపుత్ర అయ్యప్ప...
శరణాగతి నీవే తండ్రీ..
నిను మించిన ఆలోచన కానీ..
నీపదకమలాన్ని మించిన లక్ష్యం కానీ మరోటిలేదు తండ్రీ..
హేయమైన శారీరక వాంఛలూ.....
అశాశ్వతబంధాలనే మాయలో పడకుండా నను నీ దరిచేర్చుకోవయ్యా...

మణికంఠ శరణు...

శివోహం

శివా!శరణమంటే నీ చరణమని
స్మరణమంటే నీ నామమని
నిశ్చయించుకున్నాను నాకు నేనుగా
మహేశా . . . . . శరణు .

శివోహం

నా బాధలన్నిటికీ మూలకారణం నా స్వభావమే...

ఇతరుల స్వభావం కాదని తెలుసుకోవడానికి నేను చాలా కాలం తపస్సు చేయవలసివచ్చింది....

ఇక అందరినీ పవిత్రమైన మనస్సుతో ప్రేమించడానికి ఇంకెంత కాలం తపస్సు చేయవలసివస్తుందో.

మహదేవా శంభో శరణు.

శివోహం

శివా!కట్టలు తెంచుకున్న కంటినీరు
ఉప్పదనం నింపుకుంది
ఆ ఉప్పదనం ఊడిపోయి తీయదనం కూడనీ
మహేశా . . . . . శరణు .

Monday, January 23, 2023

శివోహం

నీ మనసే నీకు కష్టాలకు బాధలకు గురి చేస్తున్నది
నీ మనసుతో జాగ్రత్తగా నడుచుకో...

లేకపోతే అది నిన్ను శాంతిగా 
ఉండకుండా చేస్తుంది...

నీ మనసును ఎప్పటికప్పుడు శుద్ది చేస్తూ
శాంతంగా ఉండటం అలవాటు చేసుకో...

నీ మనసు శాంతిగా ఉంటేనే ఆనందం
ఆ ఆనందమే పరమానందం నిజమైన ఆనందం...

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివ...
నీ వెక్కడ
ఏ రూపంలో నో ఉంటావో నాకు తెలీదు కానీ నీవున్నావన్న పరిపూర్ణ విశ్వాసంతో నీ కృపకై నిరీక్షిస్తూ ఉన్నా...
అది నిరూపించుకునే బాధ్యత నీదే ఈశ్వరా...
మా రక్షణ భారం కూడా నీదే...

మహాదేవా శంభో శరణు...

Sunday, January 22, 2023

శివోహం

గడచిన కాలం ముందుకు రాదు...
నడుస్తున్న కాలం నీవు  ఆపలేవు...
వర్తమానం లో బంగారు భవిత కు పునాది వేసే ప్రయత్నం చెయ్యి...
నీ ముందు ఉన్న కాలాన్ని శక్తిని జ్ఞానాన్ని ,భక్తితో జ్ఞాన సముపార్జన కొరకై పరమాత్ముని సన్నిధానం లో జీవితాన్ని గడపడానికి  ఉపయోగించాలి...
మనమందరం కూడా అలాంటి అద్భుత వైభవ భావ సంపద ను అనుగ్రహించమని కోరుకుందాం.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!అద్దె కొంపలో నేను అమరలేకున్నాను
సొంత కొంపను చేర సాగలేకున్నాను
ఊతగా నాకు చేయూత నీయుమా
మహేశ . . . . . శరణు .

Saturday, January 21, 2023

హరిహారపుత్ర అయ్యప్ప

హరిహారపుత్ర అయ్యప్ప..
ఈ మాయామోహ జగత్తులో...
సంసారం అనే సముద్రంలో వివశులై...
దారి తెలియని స్థితిలో ఉన్నవారికి...
అద్భుతమైన,జీవన మాధుర్యంతో బాటు...
మానవజన్మ ఉద్దరణకు కావలసిన  సద్గతిని ,సన్మార్గాన్ని ,సద్భావనతో తరించే భాగ్యాన్ని నువ్వే కలుగజేయాలి...

మణికంఠ శరణు..
ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

ఓం దైత్య కార్య విఘంతకాయ  నమః 
ఓం సర్వ దుఃఖ హరణాయ నమః 
ఓం త్రిమూర్త మేత్రి గుణాత్మకయ నమః 

శ్రీరామ దూత శిరసా నమామి.....

శివోహం

శివా!కళ్ళెదుట నీ రూపం లింగాకృతిలోనున్నా
విస్తరించి వున్నది ఈ విశ్వమంతా
విశిష్టమైన నీ నామాలు వివరించును నీ తత్వం
మహేశా . . . . . శరణు .

శివోహం

వందే శంభు ఉమాపతిం
సురగురుం వందే జగత్కరణం
వందే పన్నగ భూషణం మృగదరం వందే పశునాం
పతిం వందే సూర్య శశాంక
వహ్ని నయనం వందే ముకుంద
ప్రియం వందే భక్త జనశ్రయంచ
వరదం వందే శివం శంకరం.

Friday, January 20, 2023

ఓం నమో వెంకటేశయా..

భూలోకంలో  పాపపుణ్యాల భారాన్ని మోస్తున్న వాడవు నీవు...

కాలాన్ని నిరంతరం కదిలే ప్రవాహంలా సృష్టించిన వాడవు నీవు...

సుఖ దు:ఖాలతో జీవులు బ్రతకాలని సాక్షిగా నిలిచినా వాడవు...

ఆశ నిరాశల మద్య ఊగిసలాడుతున్నా మమ్మల్ని కూడా  కాపాడి కరుణించు శ్రీ శ్రీనివాస...

ఓం నమో వెంకటేశయా

శివోహం

నేను నాది...
అహం అహంకారం...
మాయ వదలని అంతరంగం...
అన్నీ పోతే మిగిలేదే సచ్చిదానందం...
అదే పరమానందం...

ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

నమ్ము అమ్మ చరణం సర్వ పాప హరణం
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా.

ఓం శ్రీమాత్రే నమః.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం

శివోహం

శివా!వంకలెంచని నీవు వొంగైన చూడక
కినుకేల చాటేవు ఏ వంక చూసేవు
బింకమిక చాలును పంతమిక వీడుము
మహేశా . . . . . శరణు .

Thursday, January 19, 2023

శివోహం

బ్రహ్మ కే ఆది అంతం దొరకని శివలింగం...
తన భక్తుల కోసం చిన్నిగా ఒదిగి పోతాడు
చుక్క నీరు పోస్తే కరిగి పోతాడు...
పంచాక్షరీ కె పరవశించి పోతాడు...
అతన్ని మించిన దైవం ఇలలోనే లేడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, January 18, 2023

శివోహం

నా వేదనను ఇద్దరు మాత్రమే అర్థం చేసికోగలరు...
నా అద్దంలో కనిపించే వ్యక్తి ఒకరు...
మరొకరు నేను...

ఓం నమః శివాయ.

శివోహం

విశ్వమంతా వ్యాపించి ఉన్నావు...
అంతటా నీవు కాకా మరొకరు ఎలా
కనిపిస్తారు శివ...

మహదేవా శంభో శరణు.

శివోహం

శివా!నన్ను చూసి పిచ్చివాడని నవ్వుకోకు
నాకు పట్టుకుంది  నీ పిచ్చే వేరనుకోకు
ఆ పిచ్చి ముదిరిపోనీ నీ చిచ్చు రగిలిపోనీ
మహేశా  .  .  .  .  .  శరణు  .

శివోహం

శివ...
అన్నింటికీ కర్తవు నీవే కదా అన్ని నీవే చేస్తావు కదా...
నడవడం చేతకాక తప్పటడుగులు వేస్తున్న నన్ను పట్టుకొని  నీవే తీసుకో...
మనస్సుకు పూర్వజన్మల వారసత్వయంగా సంక్రమించిన వాసనల నుండి నన్ను నీవే విడుదల చేయాలి 
ప్రాపంచిక విషయాల్లో విజృంభిస్తున్న నా మదిని నిలువరించి నిరంతరం నీ నామస్మరణం నాలో ఉండేట్టు తర్పీదు ఇవ్వాలి
సదా నీ చరణాల వద్ద నా బుద్ది స్థిరంగా ఉండేటట్టు నీవే చూసుకో...

మహదేవా శంభో శరణు. 
                                       *మోహన్ వి నాయక్*

Tuesday, January 17, 2023

శివోహం

నువ్వు నాలో ఉన్ననాళ్ళు...
నా గుండెలో నీ నామం...
ఓంకార నాదమై మొగుతూనే ఉంటుంది తండ్రి...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు....
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!ఉపాదులన్నిటా నీ మెరుపు వున్నట్టు
లింగరూపాన నంది మోపురం మెరిసె
ఇది నీ సృష్టి చిత్రమే చిత్త భవుడా
మహేశా . . . . . శరణు .

శివోహం

జన్మ మృత్యు జరా వ్యాధులతో కూడిన ఈ లోకంలో జీవునికి సుఖ సంతోషాలెక్కడివి?...
ఒక్క పరమేశ్వర శరణాగతి లో తప్ప ఎక్కడా ఆనందం కనిపించదు...
ఒంటరిగా లోకంలోకి ప్రవేశించిన మనిషికి ఎవ్వరితోటి సంబంధం కలదు?...
మాయా జగన్నాటకం లో బూటకపు సంబంధాలతో వాదులాటలెందుకు? కొట్లాటలెందుకు? మిత్రమా...

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, January 16, 2023

శివోహం

దైవంకోసం, దేవతానుగ్రహంకోసం ఎప్పుడూ ఎదురు చూడకుండా, బైటనుంచి ఎటువంటి సహాయం కోసం చూడకుండా, ఎప్పడూ దేనికీ ... ఎవరిమీద దేనిమీద దేనికోసం ఆధారపడకుండా, ప్రతిఒక్కరూ ప్రతిక్షణం తమను తాము ఏ అరమరికా లేకుండా, ఎటువంటి దురాభిమానం పక్షపాతం, స్వార్ధం లేకుండా, లోపల బైటా పరిశీలించుకోవాలి,పరీక్షించుకోవాలి,పరిశోధించుకోవాలి. పాపం, హింస, వాంఛ, మోహం, స్వార్ధం మొదలగువాటికి జీవనగమనంలో చోటులేకుండా, దయ, ప్రేమ, కరుణ, సమానత్వం కలిగి... అందరూ అంతా ఒకటే, సమానమే ఆన్న ఏకత్వభావంతో, దృఢసంకల్పంతో సాధన చేస్తూ సన్మార్గవర్తనులై జీవించాలి...

ఓం శివోహం.. సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...