తెల్లవారుజామున లేచి పాదాలు నేలని తాకగానే హమ్మయ్య *ఇంకా భూమి మీదే ఉన్నాను అనే ఆనందం* అంత ఈశ్వరుడి కృప.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Thursday, February 29, 2024
శివోహం
ఆశలతో అందలమెక్కిస్తావు...
ఆనందంలోనే అన్నీ ఆవిరి చేసెస్తావు...
బంధాలతో బంధీలను చేసి...
కొందరిని బలవంతులుగా...
మరికొందరిని బలహీనులుగా మారుస్తావవు...
నీవు ఆడే ఈ ఆటలో తొలుబొమ్మలం...
శివ నీ దయ
శివోహం
కాలాన్ని వేడుకుంటున్నా..
నాలోని ఉల్లాసానికి ప్రాణంపోసి బ్రతికించమని..
సర్వ పాప హరణా...
మహాదేవా శంభో...
Wednesday, February 28, 2024
శివోహం
గౌరీ మనోహరా...
కైలాసవాసా...
దయాసిందో...
భోళాశంకరా...
అన్ని పరీక్షలు పెడితే కానీ
నీ దారికి రానా అని ఇదంతా నాటకం?...
పరమేశ్వరా! నన్ను నీవే రక్షించుకోవాలి...
ఈశ్వరా
మహాదేవ
శివోహం
దారి తప్పిన నా మనస్సు తెలిసి తెలియక చేసిన పాపాలు ఎన్నో...
గాడి తప్పిన మతిని అనుసరించి మనిషిగా చేసిన నేరాలు ఎన్నో...
అన్ని దోషాల మూటలే...
మోయలేని ఈ భారాలను నా తల ఎంత కాలం మోస్తుంది...
భారాలను బాధలను దించి హరించే వాడివి నీవు
నా బ్రతుకులు మార్చే వాడివి నీవు.
శివోహం
శివా!అంతటా వున్నవాణ్ణి అర్చిస్తున్నాను
శుభములొసగే వాన్ని స్తుతిస్తున్నాను
నా మతిని నీ గతికి నడిపించవయ్యా
Tuesday, February 27, 2024
శివోహం
జీవుడే శివుడు...
సమస్త భూతముల యందు శివుడే వ్యవస్థితుడై యున్నాడు అని ఈ విధముగా ఎవడు సత్యమును గాంచుచున్నాడో వాడే జీవన్ముక్తుడు.
శివోహం
ఎవరైతే అచంచల భక్తి, విశ్వాసములతో గురుపాదములను శరణు వేడుతారో వారి మంచి చెడ్డలన్నీ గురువు చూసుకుంటారు...
దేహం గురించి ఆ దేహములో ఉండే ఆత్మ గురించి ,ఆత్మలో ఉండే పరమాత్మ గురించి ఎవరి వల్ల తెలుసుకుంటామో ముందు అతనికి నమస్కరించాలి.
ఓం గం గణపతియే నమః.
శివోహం
ఆశలతో అందలం ఎక్కించి...
ఆనందంలోనే అన్నీ ఆవిరి చేసేసి
కర్మ లంటు ఆడుకోకు తండ్రి...
ఉద్దరించుట నన్ను...
తండ్రీ గా నీ ధర్మము కదా.
Monday, February 26, 2024
శివోహం
శివా...
నీవు వినక, కానక...
ఏమిగాను నా గతి...
నుదిటి రాతలను మార్చేదెవ్వరు..
మనసు వ్యధలని తీర్చేదెవరు...
పరమేశ్వరా నీవే దిక్కు శరణు శరణు.
శివోహం
ఒక శూన్యం నుండి మరొక శూన్యంలోకి పయనిస్తూన్నా నా జీవిత పుస్తకం జవాబుల్లేని బ్రతుకులో అన్నీ ప్రశ్నాపత్రాలే.
శివ నీ దయ.
శివోహం
శివ...
నీవు ఏ కన్ను తెరచినా
నేనుండేది నీ కనుసన్నలలోనే...
నీ మౌనం నాకు దీవెనగా భావించి జీవన యానం
సాగిస్తున్నాను...
నామేను వీడి నేను నీకడకు చేరాలనినా నా యజమానివి నీవే...
ఇంకో జన్మకు ఈ దేహం ను ఇంకో శరీరం కి బాడుగకు పంపించకుండా నీగణంలో ఒకడిని చేసుకొని నీ వాడిగా మలచుకో.
శివ నీ దయ
Sunday, February 25, 2024
శివోహం
ఎన్నో ఆలోచనలు, ఆశల కలబోత మనసు...
మనసు కి కావలసినది దొరికే వరకు అలుపు లేకుండా నిరంతరం పరితపిస్తూ నే ఉంటుంది...
శరీరానికి నటించడం తెలుసేమో గాని , మనసు కు మాత్రం తెలియదు...
ఎందుకంటే మనసు ఒకవేళ పోరపాటున నటించినా క్షోభ అనుభవిస్తూనే ఉంటుంది...
ఔనన్నా కాదన్నా ఆ విషయం మనసు కు స్పష్టంగా తెలుసు...
మనసు సంతోషం, సంత్రృప్తి పడింది అంటే చాలు ఇక అదే మనిషికి జీవిత పరమార్థం.
ఓం నమః శివాయ
శివోహం
ఎప్పుడు వచ్చి వాలాయో ఇన్ని వేల భావాలు నా గుండె గూటిలోకి...
ఏ శుభ ముహూర్తనా చేయి పట్టి ఓనమాలు నేర్పించావో మరి.
శివోహం
కాళేశ్వర
ముక్తీశ్వర
శ్రీరామలింగేశ్వరా
నగరేశ్వర
సోమేశ్వర
భీమేశ్వర
శ్రీరాజరాజేశ్వరా
బాలేశ్వర
భువనేశ్వర
సోమసుందరేశ్వరా
ఈశ్వరా
మహేశ్వరా
శ్రీకాళహస్తీశ్వరా
శంభో శంకరా
పురహరా
ఓంకారేశ్వరా
నమఃశివాయ
నమఃశివాయ
నమఃశివాయ
Subscribe to:
Posts (Atom)
శివా! నీవు ఆడుకోవడం కోసం నాకు ఊపిరి పోసి నాబ్రతుకు పోరాటంలో ఊపిరి ఆడకుండా చేస్తున్నావు నీకిది న్యాయమా? తండ్రి... అన్యమేరగనీ నాకు నా బాధలో న...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! యోగినై సంచరిస్తున్నా ఆత్మ వేత్తనై పరిశీలిస్తున్నా నిర్దారించలేని సృష్టి రహస్యం ఊ...
-
లేనిది కావాలనిపిస్తుంది ఉన్నది వద్దనిపిస్తుంది… సూదూరంగా ఉన్నవి సౌందర్యంగా చేరువైనవి వ్యర్ధంగా… శాంతినిచ్చేవి చీకాకుగా అశాంతి నిచ్చేవి ఆనందం...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి అజ్ఞాన అంధ వినాశ ...