Friday, May 10, 2024

ఓం నమః శివాయ

ఈనాటి మానవ సంబంధాలలో ఇతరుల తో నటిచడమే కాకుండా మనతో మనం కుడా నటిస్తూనే వున్నాము. బతికే ఈ నాలుగు రోజుల కోసం ఇలా మనతో మనం కుడా నటించడం అవసరం అంటారా!! ఒక్క సారి ఆలోచించండి...?

మన స్వార్ధం కోసం వాళ్ళ మీద వీళ్ళకు వీళ్ళ మీద వాళ్ళకు చెప్పి మనం లాభ పడటం సమంజసమా!!

పైకి తీయగా మాట్లాడుతూ మనకింద గొయ్యి చాలా నేర్పు గా తవ్వడం కొంత మందికి దేముడు ఇచ్చిన గిఫ్ట్.

నాకనిపిస్తుంది చెప్పేవాళ్ళు ఎప్పుడు వుంటారు, విని నమ్మే వాళ్ళది తప్పు అని.

విన్నది నిజమా!! కాదా!! అన్నది మన విజ్ఞతలో వుండాలి. దేముడు మనకు ఆలోచన ఇచ్చింది మంచి చెడు బేరీజు వేసుకుని మనం మంచి నడవడి తో జీవించడానికి, మృగాలుగా జీవించడానికి కాదు. మన అన్న స్వార్ధం వుండాలి కాని ఎదుటి వాడి నాశనాన్ని చూసేది కాకుండా వుండాలి. అప్పుడే మనం మన పిల్లలు అందరు బాగుంటారు.

మనిషి గా పుట్టినందుకు మానవ సంబంధాలను అనుబంధాలను, ఆప్యాయతలను మర్చి పోకండి. మనీషి గా బ్రతకండి.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...