Friday, May 17, 2024

శివోహం

శివయ్యా

ఎంత చతురత నీది

అడిగి అడిగి
ఎదో ఒకనాడు
మరచిపోతాడు
అని
పట్టించుకోవటం
మనకు సుమా

పరిస్థితులు
మార్చి మార్చి
నన్ను ఏమార్చాలానా

కష్టాలు పరీక్షలు
పెడితే విసిగి
దూరమవుతానానా

వెతలు వేదనలు
కలిగిస్తే
నిను మరచిపోతానానా

అపజయాలు అవమానాలు
ఏర్పరచితే
నీపై కినుక వహిస్తాననా

ఎంత మాయ
ఎంత రచన

ఎరుగవా నీవు
నేను 
పుట్టింది
పెరిగేది
గిట్టేది
నీ సన్నిధి కోసమే అని 

ఆ కోరిక
ప్రతి శ్వాసలోనూ
నిన్ను అడుగుతూనే ఉంటాను
ఆఖరిశ్వాస వరకూ

అప్పుడు
నిన్ను చేరే భాగ్యాన్ని
తప్పక ఈయాలిగా

శివయ్యా నీవే దిక్కు


No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...