Sunday, June 28, 2020

శివోహం

నిన్ను నమ్మి ఎదురు చూసే వారి కోసం....
నీవు తప్పక వాస్తవని గట్టి నమ్మకం తండ్రి...

అప్పటి వరకు నా జీవితం తరించడం కోసం....
నిన్నే స్మరిస్తూ నా జీవితం గడిపేస్తాను తండ్రి....

మహాదేవా శంభో శరణు...

శివోహం

ముల్లోకాలను మమతలతో ముడివేసావు...
ఆ బంధాలను అనుబంధాలుగా అల్లెసావు...
వాటిని అర్థం చేసుకునే మార్గము చూపు...
లయకారకా మా హృదయాలయంలో కొలువుండు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

కైలాసగిరి కొండ పైన ఎక్కడో దూరాన....

ఎక్కికూర్చొన్నావు అందనంత ఎత్తున....

సంసార సాగరమున మునకలు వేస్తూ.....

నేను చిక్కుబడి ఉన్నాను.....

నువు కరుణించేది ఎప్పుడు....
నిన్ను చూసేది ఎప్పుడు....

మహేశా శరణు శరణు........

శివోహం

అందాలను చూపెట్టి మనసు వశం తప్పెలా చేసి....

పాపాల బందీలలో పడగొట్టి జీవితమే పరవశమయ్యేలా చేసి....

లోకమనే మైకంలో నను నెట్టి.....

అన్నీ నీవని ఆశపెడతావు....

ఆటబొమ్మలు చేసి అడుకొంటావు.....

ఏమిటి ఈ చిత్రము శంకరా....

ఎంత విచిత్రము నీ లీలలు నీకే ఎరుక పరమేశ్వరా...

శంభో!!!నాలో ఆవరించి ఉన్న 

అరిషడ్వర్గాలు అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ ఆరు శత్రువర్గాలను చీల్చి చెండాడు

నా చిత్తం నీకె సమర్పిస్తా  స్వామి.....

శివోహం

నాది అనునది ఎదిలేదు.....

మనది అనునది మరీను లేదు....

ఉన్నదల్లా ఆ పై పరమేశ్వరుడే
క్రింద మనం...

ఆడేవాడు ఆడించేవాడు శివుడే....

ఓం శివోహం... సర్వం శివోహం...

Saturday, June 27, 2020

ఓం

దేవాలయంలో దేవునిమూర్తిని దర్శించాలంటే బాహ్యశుద్ది చాలు

దేహాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే అంతరశుద్ధి కావాలి

శివోహం

నిన్ను చూడకుండా ఈ లోకాన్ని
విడిచిపోతానని బెంగ నాకు లేదు తండ్రి...

లోకం అంతా నన్ను వదిలేసినా
లోకాలనేలేటోడివి నువ్వు తోడున్నావని
నీ నామంతో గడిపేస్తున్నాను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...