Tuesday, June 30, 2020

శివోహం

రెండు కనులను 
ధారపోస్తే కానీ 
తిన్నడు నీ దరిని చేరలేదు

కొడుకు శరీర  మాంసాన్ని 
నివేదిస్తే కానీ 
శిరియాళుడు నీ చేరువ కాలేదు

మూఢ భక్తితో  ప్రాణాలను 
వదిలితే కానీ 
మూగజీవాలు నీ ముక్తిని పొందలేదు

ఏమి ఇవ్వగలనయ్యా 
నేనెవరితో సాటి 

నాకు ఎందుకయ్యా 
గొప్పవారితో పోటీ 

శివోహం  శివోహం

శివోహం

నీ ధ్యాసలో ఏ శక్తి ఉన్నదో...

ఏ మర్మం ఉన్నదో తెలియదు కాని...

నీ ధ్యాసలో నన్ను నేను మరచిపోయాను...

నీ ధ్యాసలో పూర్తిగా నేను నువ్వైపోయాను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

మాలా వేసిన జీవితం...
ముక్తి వానికి శాశ్వతం...
శబరియాత్ర చేయరా 
నీ పాపం అంతమై పోవును రా 
పంబాస్నానం చేయరా 
ఆ ఘనత నీకె తెలియును రా

ఓం శ్రీ స్వామియే శరణం ఆయ్యప్ప

శివోహం

శంభో మహాదేవా...

భక్తుల ఆర్తి హరించేవాడా పాపహరా..

హరహర మహాదేవా నీచరణములే గతియంటినయా....

మహేశా శరణు శరణు....

శివోహం

నిత్యం అనునిత్యం నీ నామస్మరణా....

తప్ప మరేమీ తెలియని నాకు...

కలత నిద్దురలోనూ నీ ధ్యానమే తండ్రి....

ఓం శివోహం.... సర్వం శివమయం....

బాలాజీ

భక్త రక్షకుడవు నీవు ...
ముక్తి ప్రదాతవు నీవు....
వందనమ్ము నీకు వాసుదేవ...
అఖిల లోకములకు నాధారమగు కలియుగ దేవుడా....
చేతియూత మిమ్ము గోవిందా.....

ఏడూ కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా....

శివోహం

ఏది పుణ్యం ఏది పాపం
ఏది జ్ఞానం ఏది అజ్ఞానం 
ఏమి తెలుసు నాకు
ఏదైనా పొరపాటు చేసి ఉంటే
ఆగ్రహించక అనుగ్రహించర  పరమేశ్వరా

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...