రెండు కనులను
ధారపోస్తే కానీ
తిన్నడు నీ దరిని చేరలేదు
కొడుకు శరీర మాంసాన్ని
నివేదిస్తే కానీ
శిరియాళుడు నీ చేరువ కాలేదు
మూఢ భక్తితో ప్రాణాలను
వదిలితే కానీ
మూగజీవాలు నీ ముక్తిని పొందలేదు
ఏమి ఇవ్వగలనయ్యా
నేనెవరితో సాటి
నాకు ఎందుకయ్యా
గొప్పవారితో పోటీ
No comments:
Post a Comment