లంగా ఓణీ వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి...
కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు...
దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు...
చక్కిలి గింతలు పెట్టే చేమంతుల్లాంటి చెక్కిళ్ళు...
చంద్రబింబాన్ని పోలినది ఆమె అరవిందం...
నుదుట మద్యన జ్యోతిలా ప్రకాశించే సింధూరము...
ఊగుతూ మనసు లాగుతూ ఉండే వయ్యారి వాలుజడ...
హొయలను కురిపించే వయ్యారి హంస నడక
అద్బుత సోయగాలను చూపించే తన కాలి అందెలు
మేటి సౌందర్యాన్ని చూసి మైమరచెను నా మనసు.
No comments:
Post a Comment