Thursday, July 2, 2020

శివోహం

ఆనందంతో పడే ప్రతి అడుగూ నిని చేరాలనే.... ..
నీకోసం నడక సాగిస్తువస్తున్న.... 
గమ్యం తెలియని తీరం వైపు.... 
నీ నామస్మరణను స్మరించుకుంటు.... 
నా అన్వేషణను సాగిస్తూ వస్తున్నా.... 
కానీ దూరం తెలియదు..... 
నీలో కలిసి పోవాలని.......
మహేశా శరణు శరణు....

శివోహం

అంత 
త్వరగా అర్థం అయితే

అది 
శివతత్వం ఎలా అవుతుంది తండ్రీ

నీవే సమాధానం చెప్పాలి
హర హర మహాదేవా శంభో శంకరా

శివోహం  శివోహం

శివోహం

నీ వైపు

ఎప్పుడు
ఎవ్వరిని

ఎలా తిప్పుకుంటావో
ఎవరికి ఎరుక తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

అఖండమైన 
చితి మంటల మహా యజ్ఞంలో 
కాలిపోయే కట్టెనే కావచ్చు 

కపాల మోక్షం  నాకెందుకు తండ్రీ 
కైలాసం కరుణించిన నాడు 
నీ చేతి భిక్షాపాత్రను  నేనవ్వనా 

శివోహం  శివోహం

శివోహం

శివా!అక్షరాభ్యాసం నాడు
అక్షరాలా నీ నామం పలికాను
మంత్రోపదేశం అనుకున్నా..
మననం చేస్తున్నా
మహేశా . . . . . శరణు .

శివోహం

నిను చూడాలనే ఆశ....
చావని చూపులతో...

అను నిత్యం నీకోసం ఎదురు చూస్తున్న... 
ఏనాటికైనా నువొస్తావని....

చితి మంటలపై చేరిన జీవితాన్ని...
నీ చేతుల్లోకి తీసుకుంటావని... 

మహాదేవా శంభో శరణు....

Wednesday, July 1, 2020

శివోహం

నేను నాది అను భావన తో... 
దుఃఖమును అనుభవించుచున్నాను....
అహం స్వార్థం తో కూడిన నా మనస్సు....
అనే విచిత్రవస్తువు నీకు అర్పిస్తాను....
స్వీకరించి నా మనస్సును ఆనందపర్చు....
మహాదేవా శంభో శరణు....

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...