Saturday, July 4, 2020

శివోహం

శంకరా!!!!నీవు శిల్పివి
నీవు చెక్కిన అందమైన శిల్పాన్ని నేను
నా చేతులారా నిన్ను పూజించుకొనెడి అదృష్టం నాకెప్పుడు లభిస్తుందో 
పరమేశ్వరా!!!!నా కన్నుల నిండుగా 
నీ దివ్యరూపాన్ని చూసే భాగ్యం 
నా కెన్నడు ప్రాప్తిస్తుందో

శివోహం

పూర్వజన్మమందు పుణ్యంబు చేయకనో....

జననమరణ చక్రంలో తిరుగుచు...

కష్టలకడిలో మునుగుతూ....

భవబంధం అనే వలయం లో చిక్కుకున్న....

రక్షకుర్చే దేముడు నీవేకదా....

మహేశా శరణు శరణు....

శ్రీరామ

ఎంగిలి తినెదవు భక్తుల (శబరి)....

భక్తికి లొంగేదవు......

ముక్తిని ప్రదించెవు...

నీకునీవే సాటి దశరధ మోహన రామా...

శరణు శరణు...

ఓం శివోహం... శివోహం....

శివోహం

ఎగుడు దిగుడు కన్నులవాడు...
అందరికి సరి దృష్టి నిచ్చి తాను బేసి కన్నులు
భరిస్తున్నాడు...
బేసి కన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ప్రభూ నారసింహా...
ప్రపన్నార్తిహారా...
విభూ దైత్య సంహార...
విశ్వైకరక్షా ప్రభాకీర్ణ దివ్యాంగ...
ప్రహ్లాదవంద్యా శుభాకార లక్ష్మీశ...
శరణం తండ్రి శరణం...

శివోహం

శివా!మనసుకు మాయకు జత కుదిరెనేమో
మభ్యపెట్టి మమ్ము మోహాన ముంచేయి
పెనుమాయను పంపు ఈ మాయను తృంచు
మహేశా . . . . . శరణు .

శివోహం

ఏ కన్నో తెరిచి 
నా వైపు చూడకు 

నేనే కను మూసి
నీ పాదాల చెంత  చేరుతా 

ఏ మవునమో వీడి 
ఆనతి ఇవ్వకు 

నేనే మేను విడిచి 
నీ ముందు  మోకరిల్లుతా తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...