Thursday, July 9, 2020

శివోహం

పాహిమాం గిరిజానాథ...

పాహి కైలాసమందిర....

పాహిమాం సర్వలోకేశ....

పాహి మృత్యుభయాపహ...

శివోహం.... సర్వం శివమయం...

శివోహం

శివా! బుద్ది ఒక తీరు మనసు ఒక తీరు
ఆ రెంటి నడుమా నిత్యమూ పోరు
ఎద్దు ,ఎనుబోతుల బండి ఎటుల సాగు
మహేశా.....శరణు.

శివోహం

ప్రతి భక్తుని
హృదయాన్నీ చూడ గలగాలి 

ఎక్కడో
ఏదో ఒక రూపములో

నీవు నమ్మిన శివుడు
నీకు కనిపించక పోడు 

శివోహం  శివోహం

శివోహం

నిన్ను నమ్మితే
బూడిదిస్తావని
బల్ల గుద్ది మరీ  చెపుతున్నారు

భోళా శంకరుడంటూ 
భుజాలపై మోస్తూనే 
వెర్రి బాగులోడని అంటున్నారు

అన్నీ సహిస్తూ 
చిరునవ్వుతో భరిస్తూ
నీ సమాధానం ఒక్కటే 

" సాగనంపడమే "

శివోహం  శివోహం

శివోహం

సదా నన్ను రక్షించే దయాస్వరూపుడైన...
నా పరమశివుడు ఉండగా చింత ఎందులకు... 
జన్మ నిచ్చినవాడు నన్ను వదిలిపెట్టునా...
ఉంటే ఇక్కడ లేకపోతే అక్కడ.....

ఓం శివోహం.... సర్వం శివమయం

హరే

ఎలా చెప్పనూ...
అలల తాకిడిలా నీ తలపే అనూక్షణం..
అణువణువున తమకపు తడులే ప్రతీక్షణం.

ఏమని చెప్పనూ....
తొలికిరణపు వెచ్చదనం...
తలపిస్తోంది చెక్కిలిపై నీ అధరచుంబనం.

ఎన్నని చెప్పనూ....
మరులన్నీ అక్షరాలై కలంస్నేహం చేస్తున్నాయి..
విరులన్నీ నీ స్పర్శకోసం విలవిలలాడుతున్నాయి.

భాషేదైనా నేర్పరాదూ...
భావం అప్పగించి బంధమై నిలుస్తాను...

హరే

నిన్ను నిన్ను గా ఆరాధించే  
నాకు నువ్వు తప్ప ఇంకేమి వద్దు 
నిజమేనోయి కన్నయ్య.....!!

మరు మల్లెలైన  తెచ్చి జడలో 
                  తురమలేదు...!!
చిటికెడు కుంకుమయిన  
       నుదుటున పెట్టలేదు ...!!
సప్తపది లేదు ,అరుంధతి  
                   చూడలేదు.....!!
మూడు ముళ్ళు వెయ్యను
                          లేదు.......!! 
సావాసమే  కానీ సహచర్యం 
                          లేదు.......!!
అయినా ....!!
ఎందుకోయి  నీకోసం 
                  ఈ నిరీక్షణ ........!!
నాకు నువ్వు కావాలనే  
                    తలంపు ..........!!
ఏ హక్కు ఉందని 
                   నీ మీద............!!
ఈ అలకలు  అల్లర్లు  
                నేను నువ్వు 
                    నువ్వు నేను
                   అయి నందుకా....!!

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...