నిన్ను నిన్ను గా ఆరాధించే
నాకు నువ్వు తప్ప ఇంకేమి వద్దు
నిజమేనోయి కన్నయ్య.....!!
మరు మల్లెలైన తెచ్చి జడలో
తురమలేదు...!!
చిటికెడు కుంకుమయిన
నుదుటున పెట్టలేదు ...!!
సప్తపది లేదు ,అరుంధతి
చూడలేదు.....!!
మూడు ముళ్ళు వెయ్యను
లేదు.......!!
సావాసమే కానీ సహచర్యం
లేదు.......!!
అయినా ....!!
ఎందుకోయి నీకోసం
ఈ నిరీక్షణ ........!!
నాకు నువ్వు కావాలనే
తలంపు ..........!!
ఏ హక్కు ఉందని
నీ మీద............!!
ఈ అలకలు అల్లర్లు
నేను నువ్వు
నువ్వు నేను
అయి నందుకా....!!
No comments:
Post a Comment