Saturday, July 11, 2020

శివోహం

జవ సత్వాలన్నీ 
ఉడికి పోయిన తరువాత
ఇదే చివరి  అవతారమంటూ 
జపమాల ధరిస్తే 

ఏమి ఫలము లేదు 
ఏదీ అంటుకోదు 
అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే
తండ్రి శివప్పను తలచుకో

శివోహం  శివోహం

శివోహం

కైలాసవాసా 
కాశీ విశ్వనాధా 
కాళహస్తీశ్వర 
కాలకూటహర  
కన్నప్ప వరదా 
శివా శరణు....

శివోహం

వేంకటేశ శ్రీనివాస వేడుకుంటిమి
మా అమ్మతో నిన్ను చూడ కోరుకుంటిమి

మంగపతి మంగపతని స్మరణ చేయుచూ
మనసా వాచా నిన్నే శరణమంటిమి

శ్రీ గిరిని చేరి  గోపురము చూడగానే
నీట మునిగి నా కళ్ళు మసకబారి పోయేను
కొండలెక్కి కొలువు తీరి కులాసాగ ఉన్నావు
కొలిచిన వారికెపుడు కొంగు బంగరన్నావు

మా అమ్మ మంగమ్మను నీ గుండె నిండ చూసి
మంగపతి అని నిన్ను మననం చేస్తుంటే
మననంతో  ఆ నామం  మంత్రంగా మారి
మాయేదో జరిగినట్టు నా మనసే మురిసింది

గుండె గొంతులోకిరాగ గోవిందని అంటున్నా
గొంతులన్ని ఒక్కటిగా గోవింద అంటె వింటున్నా
పలుకు రాయి పలికింది కొండ మారు మ్రోగింది
మనసు పెట్టి వినవయ్యా మా అమ్మ కూడి రావయ్యా

శివోహం

శివా ! ఒక్కడే ఏకాకివై

అనంతమైన ప్రశాంతత నీలో ఇమిడ్చుకుని

లయ కాలంలో అనంతమైన రౌద్రాన్ని

నీలో నిలుపుకుంటూ , నిత్య చైతన్యాన్ని

శివ తాండవంగా విశ్వం అంతా ఆవిష్కరిస్తూ

నీ చుట్టూ నీవే పరిభ్రమిస్తూ...నాలో నీవే నటిస్తూ ,

నీ జీవాన్ని నాలో పోషిస్తూ. నీలో లయిస్తూ

జీవుల రోదనల, కష్టాలను, కాష్టాలను

గరళ కంఠంలో నవ్వుతూ మింగేస్తూ

ఒడలెల్ల భస్మ రాశిని రాసేస్తూ,

అనంతమైన విశ్వాన్ని దిగంబరంగా ధరిస్తూ

భరిస్తూ... చలిస్తూ. వసిస్తూ..

నీవొక నట వేషం.

నేవొక అర్ధం కానీ విశేషం

శేషం లేని ఒక శూన్యానివి

నీవెవరో ....నాలో మాత్రం సశేషం.

శివా ! నీ దయ

Friday, July 10, 2020

శివోహం

మనసు చేసిన పుణ్యమే 
శివా మదిన నిను నిలుపుటమే  

కరములు చేసిన పుణ్యమే 
కరుణాంతరంగా నిను కొలవడమే  

దేహము చేసిన పుణ్యమే 
దేవాధిదేవునికి దాసానుదాసుడనవుటమే   

పెదవులు చేసిన పుణ్యమే 
పరమేశ్వరా నీ పాటలు పాడటమే  

హ్రుది చేసిన పుణ్యమే 
శివ శివ సదా జపించటమే 
 
కనులు చేసిన పుణ్యమే
పార్వతి పరమేశ్వరుని కనులార తిలకించటమే     

ఈ జన్మ నీవు ప్రసాదించిన భాగ్యమే..

మహాదేవా శంభో శరణు...

శివోహం

దేహం 
దేవాలయమైతే 

పంచ ప్రాణాలు 
పంచాక్షరీ మంత్రాలే 

రుధిర ప్రవాహాలు 
రుద్రాభిషేకాలే

శివోహం  శివోహం

శివోహం

నేడు నిన్నగా లేకపాయే
రేపు నేడుగా మారదాయే
మరి ముందు గురించి 
చింత యేల,ఎవరిని ఎంచ్చక
నీ నామమే మాకింక శరణు
మహాదేవా శంభో శరణు....

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...