వేంకటేశ శ్రీనివాస వేడుకుంటిమి
మా అమ్మతో నిన్ను చూడ కోరుకుంటిమి
మంగపతి మంగపతని స్మరణ చేయుచూ
మనసా వాచా నిన్నే శరణమంటిమి
శ్రీ గిరిని చేరి గోపురము చూడగానే
నీట మునిగి నా కళ్ళు మసకబారి పోయేను
కొండలెక్కి కొలువు తీరి కులాసాగ ఉన్నావు
కొలిచిన వారికెపుడు కొంగు బంగరన్నావు
మా అమ్మ మంగమ్మను నీ గుండె నిండ చూసి
మంగపతి అని నిన్ను మననం చేస్తుంటే
మననంతో ఆ నామం మంత్రంగా మారి
మాయేదో జరిగినట్టు నా మనసే మురిసింది
గుండె గొంతులోకిరాగ గోవిందని అంటున్నా
గొంతులన్ని ఒక్కటిగా గోవింద అంటె వింటున్నా
పలుకు రాయి పలికింది కొండ మారు మ్రోగింది
No comments:
Post a Comment