Tuesday, July 14, 2020

శివోహం

ఈశ్వరుని పట్ల శరణాగతిని ఎలా అలవరుచుకోవాలంటే.

శరణాగతిని అలవరుచుకోవాలి అంటే ముందుగా అభ్యాసం అవసరం. పిల్ల కోతి తల్లి కోతి ని గట్టిగా పట్టుకుని ఉంటుంది
అలాగే భక్తునికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఈశ్వరునితో యందు విశ్వాసం కోల్పోకుండా అతనినే ఆశ్రయించాలి. అప్పుడు
భక్తుడు యొక్క యోగక్షేమాలు స్వయంగా ఈశ్వరుడే చూస్తాడు.

జీవితంలో ఎన్ని కష్టాలు కలిగినా ఈశ్వరుని యందు విశ్వాసం కలిగి ఉండడమే శరణాగతి. శివా నేను  నిన్నే శరణు వేడు తున్నాను కనుక నువ్వు నన్ను ఎక్కడ ఉంచితే అక్కడ అలా ఉంటాను అని ప్రార్థించాలి.

శరణాగతి ని ఎలా అభ్యసించాలో అందుకు  ఈశ్వరుని ఎలా ప్రార్థించాలో తెలుసుకుందాం.

శివా ! నేను నీ పాదపద్మాలను ఆశ్రయించాను. నాకు భౌతిక సుఖాలు వద్దు. నేను ఏప్పుడు పేరు ప్రతిష్టల కోసం పాకులాడను
ఎటువంటి అష్టసిద్ధులు కోరను. సదా నీ పాద పద్మాలు పై నా భక్తిని ఉండేటట్టు చూడు. ప్రాపంచిక విషయాలు స్వార్ద చింతన లేని పవిత్రమైన మనసును ప్రసాదించు.

నీ మాయ నుండి నన్ను రక్షించు. ఈ ప్రపంచంలో నాకు నీవు తప్ప ఎవరూ లేరు. నాకు పూజలు ప్రార్థనలు జపాలు తప్ప ఏమీ తెలియదు. నేను భక్తిహీనున్నీ జ్ఞాన శ్యునిన్ని నా మీద దయ చూపి నన్ను అన్ని విధాలుగా రక్షించు.

శరణాగతిని అలవరచుకోవడానికి మనం నిత్యం ఇలా ఈశ్వరుని ప్రార్థించాలి. ఇది కూడా సాధనలలో ఒక భాగం.

ఓం నమః శివాయ......

శివోహం

శంకరా!!!! స్మశానం నువ్వు ఉంటే
సంతోషాలు ఎందులకు నాకు ఇక్కడ
ఇల్లులు నువ్వు తిరిగి ఎత్తుతూ ఉంటే 
మేడలు మిద్దెలు నాకు ఎందుకు పరమేశ్వరా
నన్ను నీ దరికి చేర్చుకో...
కష్టాల్లో నీకు తోడుగా ఉంటా....
లేకపోతే కైలాసం విడిచి రావయ్యా నాకు తోడుగా ఉండు...
సుఖం ఎందో రుచి చూపిస్తా....
మహాదేవా శంభో శరణు...

శివోహం

కదులుతున్న కాలాన్ని 
ఒక్క దేహం మాత్రమే గుర్తిస్తుంది

అందుకే అది శిథిలం అవుతుంది 
ఆత్మ శాశ్వతం అవుతుంది

శివోహం  శివోహం

శివోహం

తండ్రీ శివప్పా

ఏదో 
ఒక సందర్భంలో
సర్వ దేవతలూ
కార్చే కన్నీటికేనా విలువ ?

మా కన్నీళ్ళకు
అస్సలు తూకమే లేదా 
పాప పుణ్యాలను లెక్కించే
అతి గొప్ప షరాబువు నీవే కదా ?

శివోహం  శివోహం

శివోహం

తెలిసి చేస్తున్న 
ప్రయాణం కన్నా 

తెలియక చేస్తున్న
ప్రయాణమే ఎక్కువ

వేస్తున్న ప్రతి అడుగూ 
నీ వైపే తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

కన్నీరు
ఆరి పోవడానికి 

గాలి కూడా
సహకరించక పోతే 

అప్పుడు 
తెలుస్తుంది తండ్రీ 

" నీ నిజమైన ఉనికి "

శివోహం  శివోహం

శివోహం

అందాలను చూపెట్టి....
బంధాలలొ పడగొట్టి...
లోకమనే మైకంలో నను నెట్టి...
అన్నీ నివేనని ఆశపెడతావు....
అదే బంధాలను తుంచి విలపించమంటావు....
ఆటబొమ్మలు చేసి అడుకొంటావు....
ఏమిటి ఈ చిత్రము శంకరా....
ఎంత విచిత్రము నీ లీలలు....
ఓం శివోహం.... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...