ఈశ్వరుని పట్ల శరణాగతిని ఎలా అలవరుచుకోవాలంటే.
శరణాగతిని అలవరుచుకోవాలి అంటే ముందుగా అభ్యాసం అవసరం. పిల్ల కోతి తల్లి కోతి ని గట్టిగా పట్టుకుని ఉంటుంది
అలాగే భక్తునికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఈశ్వరునితో యందు విశ్వాసం కోల్పోకుండా అతనినే ఆశ్రయించాలి. అప్పుడు
భక్తుడు యొక్క యోగక్షేమాలు స్వయంగా ఈశ్వరుడే చూస్తాడు.
జీవితంలో ఎన్ని కష్టాలు కలిగినా ఈశ్వరుని యందు విశ్వాసం కలిగి ఉండడమే శరణాగతి. శివా నేను నిన్నే శరణు వేడు తున్నాను కనుక నువ్వు నన్ను ఎక్కడ ఉంచితే అక్కడ అలా ఉంటాను అని ప్రార్థించాలి.
శరణాగతి ని ఎలా అభ్యసించాలో అందుకు ఈశ్వరుని ఎలా ప్రార్థించాలో తెలుసుకుందాం.
శివా ! నేను నీ పాదపద్మాలను ఆశ్రయించాను. నాకు భౌతిక సుఖాలు వద్దు. నేను ఏప్పుడు పేరు ప్రతిష్టల కోసం పాకులాడను
ఎటువంటి అష్టసిద్ధులు కోరను. సదా నీ పాద పద్మాలు పై నా భక్తిని ఉండేటట్టు చూడు. ప్రాపంచిక విషయాలు స్వార్ద చింతన లేని పవిత్రమైన మనసును ప్రసాదించు.
నీ మాయ నుండి నన్ను రక్షించు. ఈ ప్రపంచంలో నాకు నీవు తప్ప ఎవరూ లేరు. నాకు పూజలు ప్రార్థనలు జపాలు తప్ప ఏమీ తెలియదు. నేను భక్తిహీనున్నీ జ్ఞాన శ్యునిన్ని నా మీద దయ చూపి నన్ను అన్ని విధాలుగా రక్షించు.
శరణాగతిని అలవరచుకోవడానికి మనం నిత్యం ఇలా ఈశ్వరుని ప్రార్థించాలి. ఇది కూడా సాధనలలో ఒక భాగం.
No comments:
Post a Comment