Wednesday, July 15, 2020

హరే గోవిందా

అన్ని రూపములలో అన్ని ప్రాణాలలో
అన్ని తానైన రూప మొక్కటే విష్ణుడొక్కడే
కొండలలో కోర్కెలుతీర్చే కోనేటిరాయుడై
గుండెలలో బాధలుతీర్చే కొండలరాయుడై
కొలువైఉన్నాడు దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుడు

గోవిందా....... గోవిందా

ఓం నమో వెంకటేశాయ నమః

శివోహం

నీవే ఓంకారం....
సర్వ జగత్ సాక్షాత్కారం ....

నీవే విశ్వం...
అఖిల జగాల అనంతరూపం....

సకల లోకాల పుణ్యఫలం.....

ప్రభూ నీ నామస్మరణం....

ఓం శివోహం.... సర్వం శివమయం...

ఓం

భగవత్ స్మరణ

మీరు ఉదయముననే ఒకసారి భగవంతుడితో చెయ్యి కలపండి. ఒకసారి అయనను స్మరించండి. అప్పుడు ఇక చూడండి మీకు ఆఫీసులో మీ పని పాడవదు. మీకు ఏ విధమైన నష్టం జరుగదు. ఒకసారి మంగళకరమయిన భగవంతుని స్మరించుకో. మీరు "శ్రీకృష్ణ శరణం" అంటారో, "శ్రీరామ శరణం" అంటారో, "ఓం నమో నారాయణాయ" అంటారో, "ఓం నమశ్శివాయ" అంటారో, "స్వామియే శరణం అయ్యప్ప" అంటారో ,  ఎమీ అభ్యంతరం లేదు. ఉదయం లేవగానే మాత్రం ఒకసారి ఆ పవిత్రాతి పవిత్రమైన స్మరణ జరిగి పోవాలి. ఒక శ్లోకమైనా సరే, శ్లోకపాదమైనా సరే చెప్పండి. అది రోజంతా మీ మనస్సులో వుండి పోతుంది. ఉదయాన్నే మొట్టమొదట మనం ఏది చెబుతామో అది మనం మరచిపోము. మనము సంస్కారానికి దూరం కాము.  "శ్రీ రామ రామ  రామేతి, రమే రామే మనోరమే, సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే"  "శ్రీరామ , శ్రీరామ, శ్రీరామ"  అది మీ మెదడులో రోజంతా ఉంటుంది.

శివోహం

అందరూ భగవంతుని పిల్లలే...
భగవంతుడు తన పిల్లలందరినీ ప్రేమిస్తాడు...
నేను భగవంతుని ప్రేమించాలనుకుంటే
ఆయన ప్రేమించేవారందరినీ ప్రేమించడం నేను నేర్చుకోవాలి...

*Radhanath Swami*

శివోహం


  చిత్రాలు చేస్తావు
చిత్రాలు చూస్తావు
చిత్ర మైనకంటిదేవ
చిత్ర మైనపాత్ర
జీవుడి  పాత్ర 
చితా భస్మమై
నిను చేరేనా
శివా శరణు శరణు

Tuesday, July 14, 2020

శివోహం

తండ్రీ శివప్పా

దిగంతాల అంచులకైనా 
కనిపించని లోతులకైనా

నవ్వుతూ నే వెళ్ళిపోనా 
నీ చివరి చూపు  కరువైతే

నీ పద సేవ దూరమైతే 
నీ పాద ధూళి మరుగైతే

శివోహం  శివోహం

అమ్మ

తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం:

•ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి
•ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి
•ఒక్కసారి తల్లికి,తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.
•సత్యం తల్లి .............. జ్ఞానం తండ్రి.
•పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.
•ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం
•ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.
•తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది. తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...