Friday, July 17, 2020

ఓం

భగవన్నామం సోకితే సంసారమనే చీకటి వెంటనే తొలగుతుంది
పుట్టుట గిట్టుట ఇది ఒక పెద్ద చక్రం. ప్రతి వస్తువు ఒక రూపాన్ని సంతరించుకుంటుంది,  ఇది ఒక చక్రం. 
 ఒక చెట్టును చూస్తున్నాం అంటే అది మొదట గింజ, ఏయే వస్తువులనైతే తనలో చేర్చుకొని ఇంత పెద్ద వృక్షంలా మారిందో తిరిగి అన్నింటిని వాటిల్లో చేర్చి మరో రూపం తీసుకుంటుంది. ఇది ప్రతి వస్తువులో సతతం సాగుతూనే ఉంటుంది. దీనికి సంసృతి చక్రం అని పేరు. ఇందులో పడి తిరుగుతున్న వాళ్ళం మనం. ఇది మొదటి జన్మ కాదు, ఇది వరకు ఎన్ని జన్మలో తెలియదు, కొన్ని కోట్ల యుగాలుగా సాగుతూనే ఉంది...!!

శివోహం

శివా! ప్రణవాన్ని శ్రవణం చేస్తూ
పంచాక్షరి మననం చేస్తూ
నీ కోసం తపిస్తున్నా
మహేశా ..... శరణు.

శివోహం

శరీరమనే క్షేత్రంలో మంచిపనులను విత్తనములుగా చల్లి, భగవన్నామస్మరణమనే నాగలితో
నీ హృదయమే రైతై దున్నినట్లయితే
నీ అంతఃకరణలోనే భగవంతుడు ఉదయిస్తాడు.

శివోహం

ఉదయ, అస్థమయాల నడుమ
హృదయ లయకు అధిపతివి నీవు
సృష్టి, లయల మధ్య నా స్తితి గతుల
సారధివి నీవే కదా శివ...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఆశ అనెడి కొమ్మలపై నాట్యము చేయుచున్నది నా మనసు....

దురాశ వల్ల నీ పాదారవిందములు నానుండి దాచబడినవి....

నా నుదుట వ్రాసిన రాతను మార్చడములో నీవే అశక్తుడవు...

మహేశా శరణు శరణు....

శివోహం

కష్టాలూ మిత్రులై....
నాతోడు ఉంటే...

సంతోషాలు శత్రువులై...
అందనంత దూరం లో ఉంది.  
  
కోరిన కోర్కెలు వింటూ నీవు సేద తిరుతున్నవా తండ్రి...

నీకు కొటొక్క భక్తులు ఉన్నరేమో కాని...

అన్యము ఎరగని నేను
నువ్వు తప్ప వేరే దిక్కు లేరయ్య శివయ్య...

మహాదేవా శంభో శరణు....

శివోహం

మూడు కన్నుల వాడు...

ముజ్జగమ్ములను పాలించు మహాదేవుడు...

కాటికాపరి వాడు జగతి కళ్యాణ కారకుడు...

కలిమి లేమిలలోన కాపాడు మా శివుడు...

కలికి కామాక్షి విభుడు కాశీకపురేశ్వరుడు...

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...