Saturday, July 25, 2020

హరే

పాల కడలిని పర్వతాలను చేరి
ప్రభవించినావయ్యా పరమపురుషా

నమో వేంకటేశా..నమో శ్రీనివాస

ఏడేడు లోకాల ఏలికనైన నీవు
ఏడు కొండల చేరి వెలసినావు
కేశాశ్రితమైన కోటి పాపాలు
తొలగించ కోరేవు తల నీలాలు

గోవింద నామాన పట్టాభిషేకం
పలుమార్లు జరిగేను పిలిచి పిలిచి
నీకెంత ప్రయమో మాకంత ఘనము
మనాన మాకు మధురాతి మధురం

కామ్యాలు తీరినా కష్టాలు కలిగినా
శ్రమలోన అలసినా విశ్రాంతి దొరికినా
మురిపెంగ మేము మనసార పలికేదీ
గోవింద నామమే  హరి గోవిందా

గోవింద గోవింద భజ గోవింద
గోవింద గోవింద హరి గోవింద......2

Friday, July 24, 2020

శివోహం

నా నమ్మకమూ శివుడే...

నమక(నమస్కారం) పారాయణ చేయకుండా...

చమకముల(కోరికల) చేయుచుంటినని
కనుమరుగయ్యావా తండ్రి...

నవరంధ్రాల ఈ తోలుతిత్తిని నవగ్రహాలకు
వదిలేసి విడ్డూరం చూస్తున్నావా పరమేశ్వర...

నాకు నీవున్నావనే నమ్మకంతోనే ఇదంతా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నిన్ను తలవనిది నాకు పొద్దుపోదేమి.....
ఎంత తలిచిన విసుగు పుట్టదేమి తండ్రి....

మహాదేవా శంభో శరణు...

Thursday, July 23, 2020

రాదేకృష్ణ

ఎంత మాయ లోడివి రా కృష్ణ ..
నీ ప్రేమలోపడగొట్టి...
మమ్ము నీ చుట్టూ తిప్పేవు...
ఎంత గడుసు వాడ వు రా కృష్ణ...
నన్ను పట్టుటకు ఆ మురళి తో పట్టి పిలిచేవు...
ఎన్ని మాటలు నేర్చావురా కృష్ణ...
ఆ మాటలకు నా మనసు కరిగి...
నీముంగిట  వాలను....

రాదేకృష్ణ రాధేశ్యాం...
రాధే రాధే...

శివోహం

నీవు నాకు ఎన్ని జన్మలిచ్చినా నేను పలికేది ప్రణవమే...
నాకు ఏ రూపమిచ్చినా వినిపించేదీ ప్రణవమే...
పశువునైనా పక్షినైనా ఇతరమైనా అణువణువూ నీ సన్నిధియే కదా...
ఏమరపాటుగా నన్ను జన్మలనుండి వదిలేసినా
నేనుండేది నీగుండె గూటిలోనే తండ్రి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

మాయ జలమున మునిగేవు నరుడా
దారి తెలియక తడబాటు ఎలారా 
జ్ఞాన నేత్రమున వెదికి చూడవే మనసా 
శాశ్వత జ్యోతిని కనుగొనవే మనసా 

ఓం శివోహం...సర్వం శివమయం

Wednesday, July 22, 2020

శివోహం

నా మనసును మానస సరోవరం చేసి
నాలోనే కైలాసం నిలిపి...
నా గుండెలలో గూడు కట్టుకుని నిలిచాను...
నాలోకి నేను పయనించు దారితెలియక దిక్కులు తిరిగుతున్నాను...
మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...