Thursday, August 6, 2020

శివోహం

తండ్రీ శివప్పా

నీ మహామాయలో చిక్కుకున్న
చిన్న సాలీడునైతే బాగుంటుంది

నీ మోహావేశంలో బంధీయైన
మద గజమైతే ఇంకా బాగుంటుంది

నీ ముక్తిమార్గంలో పయనించే 
ప్రియ పన్నగమైతే మరీ బాగుంటుంది

శివోహం  శివోహం

శివోహం

ఎదురుగా కనిపించేది పరిమిత ప్రదేశం...
లోపలకెళ్ళి చూస్తే విశ్వం అంతా కనిపిస్తుంది...
ఏది నిజం?
బయట కనబడేది ఎప్పుడూ ఒకేలా ఉండదు...
లోననున్నది శాశ్వతం అదక్కడే ఉంటుంది...
ఈ ఓడయే ఓటిపోయి ముక్కలైపోతుంది,కొత్తనావొస్తుంది
ఆచైతన్యం అక్కడే ఉంటుంది..
తెలుసుకోవాలి ఎవరిలో ఏముందో
ప్రకృతియా! పరమాత్మయా, 
ఆత్మయా!! అంతరాత్మయా!!

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!చిత్తభవుని చితాభస్మము చేసి
అనంగుని చేసి అంతటా నిలిపేవు
తప్పించుకొన వేరె దిక్కు లేదు 
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో!!!యాగాలు చేయలేను...
దానాలు ఇయ్యలేను...
వేదాల సాధన అసలే రాదు...
నాకు తెలిసింది ఒకటే నీ నామ జపము...
ఈ జన్మకు అదే నేను చేయు తపము...
ఇకపై నీ దయ...

మహాదేవా శంభో శరణు....

Wednesday, August 5, 2020

శివోహం

ఓ నీరు తీయగా...
మరోటి ఉప్పగా...
రెండు కలిపి నా గుండె మరలో కలిసిపోయి...
నానోట పలికే నమః శివాయ నామంతో శుద్ధి అయి... నీ శిరమున పడి పానవట్టమునకు చేరుసరికి అమృతమే అగును కదా పాలకుర్తి సోమేశ్వర...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!ఈ తనువుతో నిన్ను తాకలేను
ఈ కంటితో నిన్ను చూడలేను
చూచు కంటినిస్తావో కాల్చి తాకనిస్తావో
మహేశా . . . . . శరణు .

శివోహం

విశ్వమంత వెలుగు జేయు...
లోకేశ్వరుడే సర్వలోకనికి దిక్కు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...