Friday, August 7, 2020

శివోహం

ఎన్నెన్ని 
తరాలను చూశావో 

ఎందరెందరి
తలరాతలు మార్చావో

నమ్ముకున్నంత వారికి 
నమ్ముకున్నంత నీవు తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

శంభో!!!
నాకు ముందుముందు ఏజన్మ ప్రసాదించిన నీ పాదభక్తిరసంతో నిండిన హృదయం ఉండేలా చూడు... శివా! నన్ను నరునిగా, వానరునిగా అయినా పర్వాలేదు...

నన్ను కొండగా చేసినా,పక్షిగా చేసినా, వనంలో మృగంగా చేసినా దిగులుపడను...

పరమేశ్వర నన్ను చెట్టుగా, సరోవరంగా, సాలెపురుగుగా ఎలాసృజించినా నొచ్చుకోను...

దేహం ఏదైనా పర్వాలేదు ప్రభు నా హృదయంలో నీపాదపద్మస్మరణానందలహరీ ప్రవాహం నిండుగా ఉండేలా చూడు...

మహాదేవా శంభో శరణు...

Thursday, August 6, 2020

శివోహం

అహంకారం నశించినప్పుడే అన్ని బాధలు అంతమవుతాయి...

శివోహం

భక్తి వలన అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది...

శివోహం

తండ్రీ 

నిన్ను
నేను
చూడక పోతేనేమి 

నీవు 
నన్ను 
చూస్తున్నావన్న  నమ్మకం చాలు 

సాక్షాత్తూ 
కైలాసమే 
కదిలి వచ్చినట్టుగా ఉంటుంది 

శివోహం  శివోహం

శివోహం

శివప్పా 

నీ నిశ్శబ్ధ శబ్ధ 
ప్రణవ నాద తరంగాలు

మది ముంగిట
చేరుతూనే ఉన్నాయి

గుండె గుడిని 
తాకుతూనే ఉన్నాయి తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

జడలు కట్టిన 
ఆ జటలు వెనుక 

మౌన ముద్ర 
ఆ మర్మం వెనుక 

నీ తత్వాలకు 
దారి చూపేది నీవే తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...