Saturday, August 8, 2020

శివోహం

శివా!ముక్కంట మూడు కార్యములు తెలిపేవు
మూడు శక్తులను ఒకటిగా శూలాన చూపేవు
మూడు గుణములను నీ చరణాల నిలిపేవు
మహేశా . . . . . శరణు .

Friday, August 7, 2020

శివోహం

పనికి రాని ఆలోచనలు చేస్తున్నంత కాలం నువ్వు భగవంతునికి దూరంగా ఉంటావు... 
అందుకు బదులుగా దైవానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉండు దైవానికి దగ్గరగా ఉంటావు..

శివోహం

శివుడు అభిషేక ప్రియుడు...
హాలాహలాన్ని కంఠమందు ధరించాడు...
ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు... నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

లోకాన్ని కాపాడుటలో మొట్ట మొదటి వాడు
లోకాన్ని తన శ్వాసగా బావిస్తున్న వాడు

సమస్త జీవులు ఆయన దేహాన్ని
అంటిపెట్టుకొని జీవిస్తున్నాయి

ముక్కోటి దేవతలు ఆయన ఆశీర్వాదం
ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటారు

ఆయనే దేవాది దేవుడైన మహాదేవుడు
ఆయన ఉన్నాడు కనుక అన్ని ఉన్నాయి 
ఆయన లేనిదే ఏదియు లేదు

ఓం నమః శివాయ.....

శివోహం

ఒంటి నిండా 
బూడిద పూసుకుని ?
తనువంతా
అమ్మవారిని నింపుకుని ??

నీ తత్వ జ్ఞానంలో 
నీవు మునిగి పోతే .....

నీవు తప్ప 
వేరు దైవం ఎరుగని ?
నాకు దిక్కెవరు 
తోడెవ్వరు తండ్రీ ??

శివోహం  శివోహం

శివోహం

శివా!అర్చనల నిను ఆరాధిస్తూ
అది నిచ్చెనగా నిను తెలియాలి
నువు మెచ్చగ నేను మురియాలి
మహేశా . . . . . శరణు .

శివోహం

భక్తికి అహం అతి పెద్ద ప్రతి బందకం... 
ఎందుకంటే అది తాను శరణాగతి చేయకుండా అది తరుచు అడ్డుపడుతుంది... 
అందుకే మానవుడు అహాన్ని నశింపజేసుకున్నపుడు మాత్రమే ఈశ్వరునికి నిజమైన శరణాగతి చేయగలడు... 
మాటిమాటికి ఈశ్వరుని గురించి ఆలోచించడం మరియు గురువు చెప్పిన ఆధ్యాత్మిక మార్గం లో కచ్చితమైన సాధన చేయడం అనేది దీర్ఘకాలం లో అహాన్ని నసింపజేసి భక్తిని పెంపొందిస్తారు... 

ఓం శివోహం సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...