Monday, August 10, 2020

శివోహం

సరిగ్గ ఇదేరోజు ( శ్రావణ ఆదివారం)...
నన్ను మజలీలు చేయమని భూమిపైకి పంపావు...
కష్ట, సుఖాలు అనుభవిస్తు పోరాడి ఓడిపోతు నీ అండదండలు కోరుకుంటున్నాను...
పరుగున రావా నన్ను ఆదుకోవా...
నన్ను ఆశీర్వదించాగా రావా శివా...
మహాదేవా శంభో శరణు....

Sunday, August 9, 2020

శివోహం

ఊహ తెలిసిననాడు నిను ఎరుగనైతి
మనసు తెలిసిననాడు బంధాలు గుమిగూడె
మలినాలతో మనసు ముసురుకొని వున్నాది
ఈ జన్మ నీ బిక్షే కదా తొలచి నీ సన్నిధికి నను చేర్చుకోలేవా

శివోహం


కనులెదుట కాలమే పరుగు తీస్తున్నాది ప్రభు..

ఏ జన్మ శాపమో ఏమి గ్రహచారమో బంధాలనే వీడి కదలలేకున్నాను...

ప్రతి ఘడియ నీకై తపియిస్తు వున్నాను...
ఒకసారి నిను చేరు మార్గమును చూపవా తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! నాలోని అగ్నులన్నీ నీలో కలిసిపోనీ
మధమాత్సర్యాలన్నీ మంటగలసిపోనీ
మిగిలినదంతా నీ విభూతిగ మెరిసిపోనీ
మహేశా . . . . . శరణు .

Saturday, August 8, 2020

శివోహం

సూర్యుడు సమస్త ప్రపంచానికి వేడిని కాంతిని ఇస్తాడు...
కానీ అదే మేఘాలు అడ్డు పడితే అలా అవ్వలేడు.. 
అలాగే ఎప్పటివరకైతే హృదయాన్ని అహంకారం కప్పివేస్తుందో అప్పటి వరకు హృదయం లో ఉన్న భగవంతుడు ప్రకాశించలేడు..

శివోహం

త్రికాలములను నడిపెంచేది నీవే...
నేను తలచేది నిన్నే...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నీ కృపా 
కటాక్ష వీక్షణాలలో 
ఎన్నెన్ని కఠిన పరీక్షలో కదా 

నీ రక్ష కోరుతూ
నిరీక్షించే ప్రతీ క్షణం 
నీవు ప్రసాదిస్తున్న భిక్షే కదా తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...