Saturday, August 15, 2020

శివోహం

సమస్త భూతములను సృష్టించేది, పోషించేది, లయంచేసేది ఆ పరమత్మే.

అలలు సముద్రంలోనే పుట్టి, కొంతసేపు ప్రయాణించి, తిరిగి ఆ సముద్రంలోనే కలిసి పోతాయి. 

వర్షంలో పైనుంచి పడ్డ చినుకుల వల్ల క్రింద పారే నీటిలో బుడగలు పుట్టి, కొంత దూరం ప్రయాణించి, అందులోనే 'టప్' మని పగిలిపోతాయి.

స్వప్నం అనేది నిద్రించిన జీవుడి మనస్సులో సృష్టించబడి, కొంతసేపు ఉండి, తిరిగి ఆ మనస్సులోనే లయమై పోతుంది.

అలాగే ఈ జగత్తు లోని జీవుళ్ళు అన్నీ కూడా ఆత్మయందే పుట్టి, కొంత కాలం ఉండి చివరకు ఆత్మయందే లయమైపోతాయి.

సూర్యుడు, 
చంద్రుడు, 
నక్షత్రాలు, 
అగ్ని, 
దీపం, ఇవన్నీ వెలుపలి జ్యోతులు.

కన్ను, 
ముక్కు, 
మనస్సు, 
బుద్ధి ఇవన్ని అంతరంగ జ్యోతులు.

ఇవన్నీ స్వయం జ్యోతులు కాదు.

ఎవరో ఒకరు శక్తినిస్తే వెలిగేవి మాత్రమే. 
‘వేడినీరు’ అన్నప్పుడు వేడి ఆ నీటిది కాదు. అది అగ్ని లక్షణం. అలాగే ఈ జ్యోతులన్నింటికి వెలిగే శక్తి వాటిది కాదు. ఆ శక్తి ఆత్మది. సూర్యుడు, నక్షత్రాలు స్వయం ప్రకాశాలు అని సైన్స్ చెబుతుంది. కాని అవి కూడా ఆత్మ యొక్క శక్తి వల్లనే ప్రకాశిస్తున్నాయి. అలాగే మన కన్ను, ముక్కు మొదలైన ఇంద్రియాలు కూడా ఆత్మశక్తి వల్లనే పనిచేస్తున్నాయి. అన్నింటిని తెలుసుకో గలుగుతున్నాయి.

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం

Friday, August 14, 2020

శివోహం

ఒక ఊరిలో వృద్ధ సాధువు ఉండేవాడు. ఆయన  రోజూ ఇంటింటికీ వెళ్ళి భిక్ష తెచ్చుకుని కాలం వెళ్లదీసేవాడు.   దయాగుణం, మంచిమనసు వల్ల ప్రజలకు దగ్గరయ్యాడు. దీంతో సాధువు వచ్చేసరికే ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉంచేవారు. సాధువు తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుంచి పేదవారికి, బిచ్చగాళ్లకు, దారినపోయే బాటసారులకు పంచి మిగిలినది తినేవాడు. కొన్నిసార్లు ఆహారమంతా ఇతరులకు పంచి పస్తులుండేవాడు.  ఒకరోజు ఆ సాధువు ఒక వృద్ధురాలి ఇంటికి భిక్ష స్వీకరించడానికి వెళ్ళాడు. ఆ వృద్ధురాలు చాలా పిసినారి.  ఎవరికీ భిక్ష పెట్టేది కాదు. అయినా సాధువును వదిలించుకోడానికి కొంత ఆహారం భిక్ష వేసింది. మరునాడు కూడా సాధువు ఆ ఇంటికి భిక్ష కోసం రాగా, పాడైపోయిన అన్నం పెట్టింది. మూడోరోజు కూడా సాధువు వృద్ధురాలి ఇంటి దగ్గరకు రాగానే, అతని బెడద వదిలించుకునేందుకు ఆమె ఒక  పన్నాగం పన్నింది. వంటగదిలోకి వెళ్ళి విషం కలిపిన అన్నం తీసుకువచ్చి పెట్టింది. ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి   ఇంటికి చేరుకున్నాడు.

అన్నం తిందామని ఇంటి వాకిట్లో కూర్చొగానే ఒక యువకుడు అలసటగా రొప్పుతూ నడుస్తున్నాడు. వెంటనే సాధువు ఆ యువకుడిని పిలిచి, ‘అలసటగా ఉన్నట్టున్నావు. కాస్త అన్నం తిను. కాసేపు కూర్చుని వెళ్ళు’ అని అతనికి వృద్ధురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు. దురదృష్టవశాత్తు ఆ యువకుడు వృద్ధురాలి కొడుకే. ఆకలిగా ఉన్న ఆ యువకుడు వెంటనే గబగబా అన్నం తిని  ఇంటికి బయల్దేరాడు. ఇల్లు చేరుకునే సరికి తలతిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే నురగలు కక్కుతూ తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. కొడుకు నుంచి విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమంది. ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన విద్యతో అతణ్ణి బతికించాడు. అప్పుడు వృద్ధురాలు ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధువు కాళ్ళమీద పడింది. అప్పటి నుంచి జీవితాంతం మంచితనంతో మెలిగింది.

*నమస్తే తెలంగాణా న్యూస్ పేపర్ నుండి* సేకరణ

శివోహం

శివా!జన్మ యాతన జయము కాగా
మరణ యాతన ముగియనీయి
ముక్తి పదమున నన్ను సాగనీయి
మహేశా ..... శరణు

శివోహం

పూజలు చేయుట చేతకాదు...
ఉపవాసాలు వుండుట చేతనవదు...
మనసు నీ నామస్మరణ మానదు...
కొండకోనలలో బతికే అడవిజాతి వాడిని...
పతితపావనా పావనంచేసేవాడవు నీవు...
మహాదేవా శంభో శరణు....

Thursday, August 13, 2020

శివోహం

శివా!అస్థిరమైన ఈ జీవితం స్థిరమవనీ
స్థిరమైన జ్ఞానం నా పరమవనీ
పరమందు నే జేరి నీ పరమవనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

పరమేశ్వరా!!!!!ఏమి కోరను 
ఇచ్చితివి నాకిల సుందర దేహము
అంతో ఇంతో విజ్ఞానము
కడుపు నిండుటకు సరిపడు అన్నము
పలికే ప్రతి మాట నీనామ మవనీ
తలిచే ప్రతి తలపు నీ భావమవనీ
వేసే ప్రతి అడుగు నీవైపె సాగనీ
చూసే ప్రతిచూపు నీరూపుపై నిలపనీ
మహాదేవా శంభో శరణు...

Wednesday, August 12, 2020

శివోహం

నీవు 
ప్రసన్నుడవైతే
ముకుందుడు నీతో ఉన్నట్టు

నీవు
ప్రశ్నిస్తూవుంటే
మహదేవుడు నీలో ఉన్నట్టు

శివోహం  శివోహం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...