Sunday, August 16, 2020

శివోహం

మంచి మాట మూట ఒకటి మన భుజాలపై ఉండునట...
మన పాపము హరించుకొలదు చిన్నదై దైవానికి దగ్గరగా వెడతాము...
అది ఇరుముడియో...
ఇడుముల ముడియో...
ముడివిప్పి నామడిని శుభ్రము చేయవయా శంకరా...
నను కాయవయా పశుపతీ పరమశివా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! నీవంటే మోహం నిను చేర వ్యామోహం
నువు చూడరాక క్రోధం నిను చేరలేక ఉక్రోషం
కలిగించుము మోదం అనుగ్రహించు ఆమోదం
మహేశా ..... శరణు.

శివోహం

ఒక 
చిన్న ప్రయాణానికే 
ఎన్నెన్ని
ప్రయాసలో కదా ?

మరి 

నీ 
కైవల్య కైలాసానికి
ఇంకెన్ని
ప్రయాణాలో కదా ??

నీవే 
నన్ను నడిపించాలి తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

భూమి కాని 
భూమిలో

భవుని
భద్ర భూమిలో

అందరూ వదిలేసి
వెళ్ళిపోయిన తరువాత

తోడుగా ఉండి
తన తనువుకు హత్తుకునే

ఏకైక దైవం
ప్రాణ ప్రియ మహాదేవుడు మాత్రమే

శివోహం  శివోహం

శివోహం

జీవితాంతమూ
కాదనడు
కోపం చేసుకోడు 

కరుణించడమే తెలిసిన
కైలాస వాసుడు
నీవే కదా తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

తండ్రీ శివప్పా

నీ కోసం
తొంగి చూస్తూనే ఉంటాను 

కాలిపోయే కట్టె కొనలలో 
మరుగయ్యే మట్టి ముంగిళ్ళలో 

హరహర మహాదేవా

శివోహం  శివోహం

హరి

ఇచ్చేవాడు
పైన ఉండాలని
అందరూ అనుకుంటారు

కానీ

తీసుకునేవాడు
ఆ పైన ఉండాలి అనేదే
భగవంతుని గీతా సారాంశం

మాధవా  మహాదేవా

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...