Thursday, August 20, 2020

అమ్మ

ఈ సృష్టికి మూలమైన శక్తి...

ఆ శక్తే వివిధ సందర్భాల్లో వివిధ రూపాలను ధరించి శత్రు నాశనం చేసి ఆస్తిక లోకాన్ని కాపాడుతూ వస్తుంది...

మనస్సు శాంతిగా ఉండాలన్నా,
బుద్ధి కావాలన్నా, యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, ధైర్యం, కార్యసిద్ధి, బలం, ఆయురారోగ్యాలు ఇలా ఏది కావాలన్నా అన్నిటికీ ఆది మూలం ఆ తల్లి...

అహంకారం, ఈసుఅసూయలు, కష్టాలు, నష్టాలు,కోపాలు, తాపాలు, రోగాలు, రొష్టులు, అప్పులు ఇవన్నీ తొలగిపోవాలంటే ఆ అమ్మ దయ ఉండాలి...

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే....

అమ్మ అనుగ్రహం ఉంటే వానికి లేనిదేమిలేదు...

ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీదుర్గదేవినే నమః

శివోహం

శివా! దేహ భావము విడిచి పెట్టి
ఆత్మ భావము ఒడిసి పట్టి 
అణువణువున నిన్ను చూడనీయి
మహేశా.....శరణు.

Wednesday, August 19, 2020

శివోహం

వర్షించే కళ్ళల్లో 
నీ రూపం అస్పష్టంగా 

మూగబోయే గొంతులో
నీ నామం గద్గదంగా 

తన్మయత్వమయ్యే తనువులో
నీ తత్వం తార్కికంగా 

నిత్యమూ 
నీ సన్నిధిలో

" ఏమిటీ  నీ మాయ తండ్రీ "

శివోహం  శివోహం

శివోహం

చివరి
ప్రస్థానంలో

హితుడైనా
స్నేహితుడైనా
సన్నిహితుడైనా
సంబంధీకుడైనా

బంధువైనా
బలగమైనా
ఆత్మీయుడైనా
ఆత్మ పరంజ్యోతివైనా

నీవే కదా తండ్రీ
హర హర మహాదేవ్

శివోహం  శివోహం

శివోహం

శివా!లోకాలేలే పని పెట్టుకొని
 నాలో నాకై కనిపెట్టుకొని
 కడకు కాటివద్ద కాచుకున్నావా
 మహేశా . . . . . శరణు .

శివోహం

కాలపు తెరపై....
చావుపుట్టుకల చక్రాన్ని ఓ తిప్పేస్తూ ఉంటావు.....
అలసిపోవా పరమేశ్వరా.........

చావుపుట్టుల చక్రం లో పుట్టి గిట్టి నేనైతే అలసిపోయాను.....

ఇక నీ ఆటలు ఆపు తండ్రి నేను అడలేను...

మహాదేవా శంభో శరణు...

Tuesday, August 18, 2020

శివోహం

ఉదయకాలపు బ్రహ్మవు...
మధ్యాహ్న రుద్రుడవు...
సాయంకాల నారాయణుడవు...
నీవే నా మదిలో మెదిలే దేవదేవుడవు...
సోమ,  సూర్య, అగ్నులు నేత్రాలుగా గలిగిన దేవా...
ఆతేజములే మాకు మూడు రూపాలుగా  అగుపించెను పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...