Saturday, August 22, 2020

శివోహం

పాప పుణ్యాల లెక్కలు కూడి
నీ పాద సేవకు దూరం చేయకు 

జమా ఖర్చుల పద్దులు రాసి 
నీ కైలాసంలో చోటు లేదనకు తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

శివా!బ్రతుకెంత భారమైన నిన్ను తెలిసిన నాడు
అది దూది పింజవోలె తేలిపోవు
తెలియరావయ్యా ఈ బ్రతుకు తేలునటుల 
మహేశా . . . . . శరణు

Friday, August 21, 2020

వినాయక చవితి శుభాకాంక్షలు

జీవితంలో ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగించి విజయాలను దరిచేర్చేవాడు విఘ్నేశ్వరుడు...
నిందలను, విఘ్నాలను తొలగించి ముక్తిని ప్రసాదించే గణనాధుడిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. 

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సబ్యులకు, పెద్దలకు గురువులకు శ్రేయోభిలాషులకు 'వినాయక చవితి' శుభాకాంక్షలు...

శివోహం

శివా!నా చుట్టూరా చీకటి
చిక్కని చీకటికావల నీవు
దాటనీ చీకటి ముడిపడ నా భృకిటి
మహేశా . . . . . శరణు .

శివోహం

నేను నీలో కలిసిపోవటం అంటే...
నన్ను నేను తెలుసుకోవటమే కదా తండ్రి...
అందుకే నిన్నే నాలో కొలువుంచా...
మహాదేవా శంభో శరణు...

Thursday, August 20, 2020

అమ్మ

ఈ సృష్టికి మూలమైన శక్తి...

ఆ శక్తే వివిధ సందర్భాల్లో వివిధ రూపాలను ధరించి శత్రు నాశనం చేసి ఆస్తిక లోకాన్ని కాపాడుతూ వస్తుంది...

మనస్సు శాంతిగా ఉండాలన్నా,
బుద్ధి కావాలన్నా, యశస్సు, తేజస్సు, ఐశ్వర్యం, ధైర్యం, కార్యసిద్ధి, బలం, ఆయురారోగ్యాలు ఇలా ఏది కావాలన్నా అన్నిటికీ ఆది మూలం ఆ తల్లి...

అహంకారం, ఈసుఅసూయలు, కష్టాలు, నష్టాలు,కోపాలు, తాపాలు, రోగాలు, రొష్టులు, అప్పులు ఇవన్నీ తొలగిపోవాలంటే ఆ అమ్మ దయ ఉండాలి...

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే....

అమ్మ అనుగ్రహం ఉంటే వానికి లేనిదేమిలేదు...

ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీదుర్గదేవినే నమః

శివోహం

శివా! దేహ భావము విడిచి పెట్టి
ఆత్మ భావము ఒడిసి పట్టి 
అణువణువున నిన్ను చూడనీయి
మహేశా.....శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...