Saturday, August 29, 2020

శివోహం

శివా!పాశాన కట్టి నన్ను పశువును చేసావు
బొడ్డు తాడుతో కట్టి నన్ను బయటకంపేవు
ఈ కట్టులన్నీ త్రెంచి నన్ను ఎగరేసుకుపో
మహేశా . . . . . శరణు .

శివోహం

భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు
చిత్తములో వెతకండి...

భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు...
కానీ మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన మనకి కానరాడు...

మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు...
మొదటిది 'నేను' అనే తలంపు, ఇక రెండవది 'నాది' అన్న తలంపు...
మొదటిది అహంకారం, రెండవది మమకారం...

ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు....

జై శ్రీమన్నారాయణ
ఓం శివోహం... సర్వం శివమయం

గోవిందా

ఏమయ్యా వేంకటేశా ఏమిటి నీ లీల
చాలించుము నీ హేల వినవయ్యా మా గోల

భోగ మూర్తివి నీవు భోగాలకు కొదవలేదు
దిగులు దిగులుగున్నాము దిక్కు తోచకున్నాము
దిగులంతా మాకేలే నీ దర్శనమే కరువాయై
ఏమి నీ దరహాసము ఎందలకీ పరిహాసము

నీ సేవల కొరతలేదు మాకే ఈ వెలితంతా
ఎగబడి వస్తున్నారు సుర ముని సందోహం
లోపమేమిటో మాకు రూపు తెలియకుంది
శాపమేదో.. శోకంగా మారినట్టు ఉంది

ఏడు కొండలెడబాటు  ఏమిటి మా గ్రహపాటు
ఏ సేవలు చేయలేక నీ సేవలు చూడలేకా
విరహంతో మేము  విలయాన  మునిగేము
ఈ విలయానికి నీవే వరమునిచ్చినావ

ఆనంద నిలయాన అడుగు పెట్టి నిన్ను చూసి
పరవశాన కనులు మూసి ఎదలోన నిన్ను తలచి
కులశేఖర గడప చేరి కోర్కెలన్ని మరువనీ
అనుభవాల మాటకేమి అనుభూతిని పొందనీయి

Friday, August 28, 2020

శివోహం

శరీరం లోపల అంతర్గముగా నుండు సూక్ష్మతత్త్వములతో కూడియుండిన అంతఃకరణమునే అంతరింద్రియమని అందురు. పంచభూతముల యొక్క సూక్ష్మంశములే మనో, బుద్ధి, చిత్త, అహంకారంలతో కూడిన అంతఃకరణం. ఈ నాలుగింటితో కూడిన అంతఃకరణమునే అంతఃకరణ చతుష్టయం అంటారు. గాలి, అగ్ని, జలము, పృథ్వి, ఆకాశాంశలతో కూడినదే అంతఃకరణం. అంతఃకరణముది ఆకాశతత్త్వం కాగా, మనస్సుది వాయుతత్త్వం, బుద్ధిది అగ్ని తత్త్వం, చిత్తముది జలతత్త్వం, అహముది పృథ్వితత్త్వం.
మనస్సు :- వాయుతత్త్వం అగుటచే నిరంతరమూ చలించుటకు కారణమగుచున్నది. ఇది చంచలమైనది. సంకల్ప, వికల్పములు దీని కార్యములు. అనిశ్చితస్థితి. చంద్రుడు అధిష్టానదేవత.
బుద్ధి :- అగ్ని అంశమగుటచే నిశ్చయించుగుణం కలిగియున్నది. నిశ్చలస్థితి. నిశ్చయం, మంచి చెడుల విచక్షణాజ్ఞానం దీని లక్షణం. స్వంత సామర్ధ్యం కలది. అధిష్టానదేవత పరబ్రహ్మ.
చిత్తము :- జలాంశమగుటచే మందగమనం దీని స్వభావం. అనేక విధములగు ఆలోచనలు కలది. ప్రాణి కోట్ల వృత్తులన్నియు దీనియందు యుండును. శరీరమునందలి సర్వేంద్రియములను చలింపజేస్తుంది. మహావిష్ణువు అధిష్టానదేవత.
అహంకారం :- పృధ్వీ అంశం. కాఠిన్యస్వభావం. నేను, నాది అను అభిమానమును కల్గించును. ఈ తత్త్వంతో చేయు క్రియలు, వాటిచే ఏర్పడిన గర్వం దీని స్వంతం. కోపం, రోషం, స్వార్ధం మొదలగు వాటికి ఈ అహమే కారణం. అధిష్టానదేవత రుద్రుడు.
ఈ అంతఃకరణ చతుష్టయం విజ్రుంభన ఆగి నిర్విషయస్థితి కలుగనంతవరకు అంతరశుద్ధి కలుగదు. అంతఃకరణశుద్ధి కానంతవరకు ఆత్మతత్త్వం గ్రహించలేం.

హరే

ధర్మబద్ధమైన కోరిక అశాంతిని కలిగించదు.కోపాన్ని పుట్టించదు.మనసును శుద్ధి చేసుకోవాలంటే మొదటగా భగవంతుడు ప్రసాదించిన దానిని స్వీకరించాలనే భావం మనిషిలో కలగాలి.ఈ భావం వలన కోరిక అనేది నశించిపోతుంది. అపారమైన ప్రేమను భగవత్పరంగాను, భగవంతుని ప్రతిరూపమైన తోటి జీవుల పరంగాను పెంపొందించుకుంటే కోపం అనే మలినం తొలగిపోతుంది. త్యాగగుణాన్ని అలవరచుకుంటే లోభగుణానికి చోటుండదు. భగవంతుని పట్ల ప్రేమ, భక్తిని పెంచుకొనుటచేత మోహం కూడా దూరమైపోతుంది.ఈ ప్రపంచ సౌఖ్యాలన్నీ అనిత్యమనే వివేకం చేత మదము, మత్సరము రెండు మలినాలు కడుక్కుపోతాయి.

ఈ విధంగామనసుపై నుండు మలినములను శుద్ధి చేసుకోకుండా బాహ్య శుద్ధి ఎంత చేసినా భగవత్ప్రేమకు నోచుకోలేరు.

సర్వే జనా సుఖినో భవంతు.

శివోహం

శివా! ఊరూ వాడ ఉన్నది నీ లింగాకృతి 
ఊరవతల మాత్రం నీది ఈ ఆకృతి
ఊరు  వదలిన మమ్ము ఊరడిద్దామనా
మహేశా .... శరణు.

శివోహం

స్వార్థమే అనుకో 
స్వలాభమే అనుకో  తండ్రీ

నిన్ను 
ఉర్రూత లూగించే 
డమరుక నాదమై
మిగిలి పోవాలి 

నిన్ను 
మైమరిపించే 
శంఖా రావమై 
నిలిచి పోవాలి 

హర హర మహాదేవ్ 

శివోహం  శివోహం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...