Saturday, August 29, 2020

గోవిందా

ఏమయ్యా వేంకటేశా ఏమిటి నీ లీల
చాలించుము నీ హేల వినవయ్యా మా గోల

భోగ మూర్తివి నీవు భోగాలకు కొదవలేదు
దిగులు దిగులుగున్నాము దిక్కు తోచకున్నాము
దిగులంతా మాకేలే నీ దర్శనమే కరువాయై
ఏమి నీ దరహాసము ఎందలకీ పరిహాసము

నీ సేవల కొరతలేదు మాకే ఈ వెలితంతా
ఎగబడి వస్తున్నారు సుర ముని సందోహం
లోపమేమిటో మాకు రూపు తెలియకుంది
శాపమేదో.. శోకంగా మారినట్టు ఉంది

ఏడు కొండలెడబాటు  ఏమిటి మా గ్రహపాటు
ఏ సేవలు చేయలేక నీ సేవలు చూడలేకా
విరహంతో మేము  విలయాన  మునిగేము
ఈ విలయానికి నీవే వరమునిచ్చినావ

ఆనంద నిలయాన అడుగు పెట్టి నిన్ను చూసి
పరవశాన కనులు మూసి ఎదలోన నిన్ను తలచి
కులశేఖర గడప చేరి కోర్కెలన్ని మరువనీ
అనుభవాల మాటకేమి అనుభూతిని పొందనీయి

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...