Saturday, September 5, 2020

అయ్యప్ప

నీ రూప మెంతొ సుందరం
నీ నామ మెంతొ మధురం
నీ దర్శనమే మాకు చాలు మణికంఠ...

నీ చూపులు మంచు కన్న చల్లనా
నీ పలుకులు తేనకన్న తీయనా
నీ నామమే మాకు శరణు హరిహర తనయ...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు...

శివోహం

సమస్త చరాచర ప్రాణి కోటికి
శివ పార్వతులే ఆరాధ్య దైవలు....

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, September 4, 2020

శివోహం

జ్ఞానం, అజ్ఞానం రెండింటికీ అతీతుడవు అయిపో... అప్పుడు మాత్రమే భగవంతుని తెలుసుకోగలవు...
నానా విషయాలను తెలుసుకోవడం అజ్ఞానం...
పాండిత్యం ఉందన్న అహంకారం కూడా అజ్ఞానమే...
'సర్వభూతాలలోనూ ఉన్నది ఒకే భగవంతుడే' అన్న నిశ్చయాత్మక బుద్ధియే జ్ఞానం...
భగవంతుని విశేషంగా తెలుసుకొంటే అది విజ్ఞానం...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

మాయ కాకపోతే 
మరేమిటిది మహాదేవా

నీ గుడికీ 
నా గుండెకూ

ఏమిటీ 
అవినాభావ సంబంధం  తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

ఒక 
చిన్న మెతుకు కోసం 
సృష్టి మొత్తమూ 
నిత్యమూ సంఘర్షణే 

నీవు ఉన్నావన్న 
ఒకే ఒక్క ధైర్యంతో 
నేను 
ఏమీ తెచ్చుకోలేదు తండ్రీ

నీ కోసం 
నా కోసం 
నా వారి కోసం 

శివోహం  శివోహం

శివోహం

చూసేదెలా నిన్ను
చేరేదెలా నిన్ను
కలిసేదెలా నిన్ను
కొలిచేదెలా నిన్ను 

ఏ కొండ కోనలో 
శిలవైతివో 
ఏ వల్లకాటిలో 
కొలువైతివో 

మై మరచి
నను మరచి
మరుగైతివో 

కన్నెత్తి చూడక 
కనుసైగ కరువైతే 
కైలాస ద్వారాలు 
చేరేదెలా
నీ పద సన్నిధి 
పొందేదెలా 

శివోహం  శివోహం

శివోహం

పుణ్య భూములు 
కర్మ భూములు
జన్మ భూములు
రుద్ర భూములు 

శివ శివ శివ శివ
స్మరణ చేయగా
హర హర హర హర
ప్రస్తుతించగా

తళ తళ తళ తళ
శూల ధగ ధగలు
ఢమ ఢమ ఢమ ఢమ
డమరు నాదములు

చండ ప్రచండ
ప్రప్రథమ నృత్యములు
అగ్ని శిఖల  
ఆ అరుణ వర్ణములు

సర్వ దేవతలు
సకల శాస్త్రములు
ప్రమద గణములు
పంచ భూతములు

శరణు కోరుతూ
నిన్ను వేడుతూ
పాహి పాహి
నీ పదము చేరుతూ

ఏమని చెప్పను
ఎంతని చెప్పను
శివుడు హరుడనీ
భవుడు గురుడనీ

మహదేవుడు
నా ప్రియ ప్రియుడనీ 
కైలాసము
నా ముక్తి మోక్షమనీ

శివోహం  శివోహం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...